TROLL - PRASNINCHE STREELA ANUBHAVA KATHANALU by K N MALLISHWARI Telugu book cover

TROLL - PRASNINCHE STREELA ANUBHAVA KATHANALU

by K N MALLISHWARI

₹200
In stock · 13 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076374
TROLL డిజిటల్ హిందూత్వ రాజకీయ వ్యవస్థ, ట్రోలింగ్ ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన సంప్రదాయిక వాదాన్ని బలపరుస్తుంది. మూక దాడులను, విద్వేషాలను రగిలిస్తుంది. అసమ్మతి, నిరసన, భిన్నత్వం, వాక్ స్వాతంత్య్రం వంటి విలువలు రాజ్యాంగ నైతికతకు పునాదులు, ప్రజాస్వామిక బహుళ సమాజ మూలస్తంభాలు. ఈ సంకలనం హిందూత్వ ట్రోలింగ్ వాతావరణంలో ఈ రాజ్యాంగ విలువలను స్థిరపరిచే మార్గాలను చూపుతుంది. వీటిపై చర్చ కొనసాగటానికి దోహదం చేస్తుంది. - కల్పన కన్నబిరాన్ ఈ పుస్తకంలోని స్త్రీలు ప్రశ్నించారు. మతతత్వానికి ఎదురుగా నిలబడి లౌకికత సంగతి ఏమిటన్నారు. స్త్రీల శరీరాలపై స్త్రీలకే హక్కు లేదా అన్నారు. మైనార్టీలు కూడా మనుషులే వారికి హక్కులు ఉంటాయన్నారు. కొన్ని కులాలకి ఆధిక్యం ఎందుకు అని అడిగారు, రాజకీయ పార్టీల ప్రహసనాలను కళ్ళకి కట్టారు, మూఢ నమ్మకాలు వద్దు, సైన్స్న నమ్మమన్నారు, ఎవరి ఆహారం వారిష్టమని అన్నారు. వీరంతా భిన్నత్వాన్ని కోరుకున్నారు. వ్రాశారు, మాట్లాడారు, చర్చించారు. అందుకుగాను తీవ్రమైన ట్రోలింగ్కి గురయ్యారు. పోర్న్ సైట్లలో అమ్మకపు సరుకుగా మార్చబడ్డారు. కేసులు, బూతులు, బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు, నిరంకుశ ఉపదేశాలు-అన్నీ భరించారు. బాధ, దుఃఖం, ఆగ్రహానికి గురవుతూ కూడా తాము నమ్మిన విలువలు, విశ్వాసాల వ్యాప్తి కోసం, నిలిచి పోరాడుతున్న స్త్రీలతో సంభాషణకు తలుపులు తీస్తుంది ఈ పుస్తకం. ఏక మత రాజ్యస్థాపన కోసం భిన్నాభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుపోతున్న వర్తమాన అధికార రాజకీయాల అంధకారంలో ఆశను వాగ్దానం చేస్తుందీ పుస్తకం.