UDAYABABU MASTARI KATHANIKALU by KOTHAPALLI UDAYABABU Telugu book cover

UDAYABABU MASTARI KATHANIKALU

by KOTHAPALLI UDAYABABU

₹100
In stock · 8 available
PublisherSRI VEDAGIRI COMMUNICATIONS
LanguageTelugu
నా కథానికా గమనం... సమాజహితాన్ని కోరుతు కదలకుండా చదివించి మంచి సందేశం అందించేదిగా బీజం వేసారు 'అమ్మ.’ నాన్నగారు నేర్పించిన పుస్తక పఠనం, అమ్మ కథలను చెప్పిన తీరు 'కథ' పట్ల నా అభిరుచిని పెంచాయి. చిన్నప్పటినుండి నాన్నగారు వ్రాసి దర్శకత్వం వహించి, నటించిన సాంఘిక నాటికలలో నా పాత్ర 'బుజ్జాయి' కూడా నా కథలకు ప్రేరణ. 1985వ సం||లో 02.06.1985 ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 'సుందరి - సుబ్బారావు' తొలి కథగా ప్రచురింపబడింది. ఆ తరువాత కొద్ది రోజులలో నాకు అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ 'ఎల్లోరా' గారి సంతకంతో రు.40/-లు రెమ్యునరేషన్ పంపుతూ లేఖ అందింది. 'ఇదే విధంగా మీ రచనా ప్రవృత్తిని అభివృద్ధి చేసుకుంటే You will be a Successful Writer అని అభినందించారు. అప్పుడు 'కథ' విలువ నాకు తెలిసింది. అప్పటినుండి సుమారు 150 కథానికలుకు పైగా వివిధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురింప బడ్డాయి. చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలనే తపనతో ప్రవృత్తిని అడపా దడపా మాత్రమే కొనసాగించాను. 2003లో అందమైన తీగకు... అనే కథా సంపుటిని, 2007లో చిగురుపిట్టలు అనే నానీల సంపుటిని వెలువరించాను. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. మనం నేర్చుకున్న 10 విషయాలలో కనీసం 5 విషయాలు విద్యార్థి స్వయంగా ఆచరించగలిగేలా అతని స్థాయికి దిగి బోధించాలన్నదే నా వృత్తి నియమం. ఆ క్రమంలో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలు, అవమానాలే ఈ కథానికలకు బీజాలు. వాటన్నింటిని ఒకే కథానికల సంపుటిగా తీసుకువద్దామన్న ఆలోచనకు ముందుమాట వ్రాయమని ఆత్మీయ మిత్రులు శ్రీ వేదగిరి వాంబాబుగారిని కోరడం జరిగింది. ఆసాంతమూ చదివి అమూల్యమైన అభిప్రాయాన్ని అందించారు. అంతేకాదు ఈ కథానికా సంపుటాన్ని శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ద్వారా ప్రచురిస్తున్నందుకు వారికి నా సాహితీ కృతజ్ఞతా ప్రణామములు. ఇందులోని కథానికలను ప్రచురించిన వివిధ పత్రికా సంపాదకు లకు, ఆయా కథలకు తగిన బొమ్మలను అందించిన లబ్ద ప్రతిష్టులైన చిత్రకారులకు, అమూల్యమైన సూచనలు, సలహాలు అందించిన సాహితీ మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.