
UDAYINCHU UDYAMINCHU
₹100
In stock · 26 available
PublisherSAIBABA PUBLICATIONS
LanguageTelugu
అలజంగి ఉదయ్ కుమార్ తొలి పాఠకుని స్పందన అలజంగి ఉదయ్ కుమార్ విరచిత కవితా సంకలనం "ఉదయించు -ఉద్యమించు" యువతి యువకులను ఉత్తేజపరిచే విధంగా రూపుదాల్చినది. ఈపుస్తకం చదవడం ఒక అనుభవం. పూర్తయ్యాక భవిష్యత్ పట్ల కొత్త ధృక్పథంతోపాటు నిశ్చయంగా విజయ శిఖరాలకు సుకోవాలనే ఆకాంక్ష యువత లో జనించి తీరుతుందంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిత్వ వికాస సూత్రాలను స్వీయానుభవాలతో మిళితం చేస్తూ యువతీ యువకులకు పద్దేశనము చేస్తూ వచ్చిన కవితా సంకలనం ఇది. ఈ కవితలలో లాల్ సలాం, లాల్ సలాం, పితుని కథనం, కంఫర్ట్ జోన్ సంకెళ్ళు, రూపాయి కర్మయోగి, ఓ ప్రళయం అవసరం, అమ్మా! మాట్లాడమ్మా ప్లీజ్, అందంగా లేనా? లాంటి కవితలు ప్రత్యేకమైనవి. జీవితంలోని అరుదైన శ్రావాలను మనకు చూపిస్తూ మనల్ని గొప్ప ఉద్విగ్నతకులోను చేస్తాడు కవి. భావప్రధానమైన తలు కావడం చేత దానికి తగిన శైలి ఈ కవితల్లో మనకు కనిపిస్తుంది తప్ప లాక్షిణికులు చెప్పిన శిల్ప లక్షణాలన్ని ఈ కవితలలో వెతకబూనడం ఔచిత్యం కాదు. ఉదయకుమార్ తండ్రి కీ.శే. అలజంగి నారాయణ రావు, తాత కీ.శే. అలజంగి అప్పల నాయుడు గార్లు సాహిత్యపిపాస గలిగినవారు. స్వగ్రామం నారాయణపురం (బలిజపేట మండలం, విజయనగరం జిల్లా) లో వారు అనేక సాహితీ సదస్సులు, పద్య సదన్సులు ఏర్పాటు చేసి కళామతల్లి సేవలో నిత్యం మునిగి తేలేవారు. తాత భామాకలాపం నర్తనతోనూ, తండ్రి నారాయణరావు గారు తన నటనా కౌశల్యంతో హరిశ్చంద్ర, రక్తాంజలి, లంకెబిందెలు మొదలగు నాటకాలతో అటు వాయక, ప్రతినాయక పాత్రలలో జనాల్ని మెప్పించేవారు.