UDAYISTUNNA BHOOMI ASTHAMISTUNNA CHANDRUDU by DR.T.V.BHASKARACHARYA Telugu book cover

UDAYISTUNNA BHOOMI ASTHAMISTUNNA CHANDRUDU

by DR.T.V.BHASKARACHARYA

₹116
In stock · 14 available
PublisherDR.T.V.BHASKARACHARYA
LanguageTelugu
నీ పుస్తకం చదివానయ్యా ! చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది... మహా బాగా రాశావ్ పో ! అందుకే మళ్లీ మళ్లీ చదివాను... ఔను అలా చదివించింది నీ పుస్తకం... నీవై ఉదయిస్తున్న నీ భూమి !... నీ ఈ శబ్ద చిత్రాలు... కలకాలం నిలుస్తాయి.. కవిత్వం అతి కొత్తగా ఉంది... భావం భాషను కొత్తగా పుట్టిస్తున్నట్లుగా ఉంది... కవిత చెప్పే తీరు. అదో అద్భుతం... అమృతం... చెప్పలేని మంత్ర ముగ్ధత... రచయిత... తన కోసమే... ఇంత కష్టపడ్డాడని పాఠకుడికి తెలుస్తుంది. అది పాఠకుడిపై ముద్రవేస్తుంది... ఇంతకంటే ఏ కవికైనా రచయితకైనా ఇంకా ఏం కావాలి. పుస్తకం విప్పి చదువుతున్న కొద్దీ... కళ్ళు వింటాయి... చెవులు చూస్తాయి... మనస్సు అక్కడక్కడ ఆగుతుంది.. బుద్ధి తర్కిస్తుంది. ఆలోచింపచేస్తుంది. గుండె పరుగెడుతుంది. చూపులు వెతుక్కుంటాయి.. చక్కెర ముక్కను తేనె చుక్కను... చూసినా... తాకినా... కొంత తెలుస్తుంది. కారణం అనుభవించి ఉన్నాం కాబట్టి..... ఇక... మీరు ఈ పుస్తకం చదివితే పొందే ఆనందం మీకే తెలుస్తుంది. నేను చూసింది తాకింది... తిన్నది అరిగించుకున్నది వివరించా...... కొసమెరుపు... కవితలతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. అయినా ఇలాంటి కొత్త కొత్త సింగారాలతో ఉన్న కవితలను చూడడం ఇదే తొలిసారి..