UDHYAMA PRATAPAM - KANDIMALLA PRATAPAREDDY JEEVITHAM SAHITYAM by DR.V.VINDHYA VASINIDEVI Telugu book cover

UDHYAMA PRATAPAM - KANDIMALLA PRATAPAREDDY JEEVITHAM SAHITYAM

by DR.V.VINDHYA VASINIDEVI

₹250
In stock · 13 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789358108187
తెలంగాణా సాయుధ పోరాటం భారత స్వాతంత్య్ర సమరానికి ఏ మాత్రం తీసిపోనిది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు శ్రీ రావి నారాయణరెడ్డి గారు. ఆయన ఆ ఉద్యమాన్ని నడిపిన సారథి. ఆయన మాటలలో ఆనాటి రైతాంగ పోరాటం, సామాన్యులు అసామాన్యుల వలె, నిజాం నిరంకుశ పాలనకు భరతవాక్యం పలకడం స్వయంగా విని ఉత్తేజితురాలినయ్యాను. వారి అంతేవాసి కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు. వారిరువురి అనుబంధం అపురూపమైనది. రావినారాయణరెడ్డి గారు మా వారికి మేనమామ. ఆ కారణం వలన కూడా ప్రతాపరెడ్డి గారిని గురించి ఎరుగుదును. విద్యార్థి దశనుంచే వారి జీవితం ఉద్యమానికి అంకితం చేశారు. ఉద్యమకాలంలో పాటలు, జానపద గేయాలు ఎక్కువగా వస్తాయి. ప్రచారానికి అవి ఊపునిస్తాయి. ఉద్యమం ఫలప్రదంగా ముగిసిన తర్వాత ఆ అనుభవాలు, జ్ఞాపకాలు ఉద్యమ నాయకుల ద్వారా వెలుగులోకి వస్తాయి. నెమ్మదిగా కథలు, నవలలుగా రూపుదాల్చుతాయి. ఈ క్రమం మనకు దేశభక్తి కవిత్వం, కథలు, నవలలుగా రావడంలో కూడా కనిపిస్తుంది. తెలంగాణా సాయుధ పోరాటం గూర్చి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే రెండు పార్శ్వాలను గూర్చి తెలుసుకోవాలి. రావి నారాయణరెడ్డి గారు మొదట గాంధేయవాది. ఏ విధంగా వారు సాయుధ పోరాట నాయకులయ్యారో వారి ఆత్మకథ “నా జీవనపథంలో”