UDYOGAM MEEKE by DR.G.RAMACHANDRAREDDY Telugu book cover

UDYOGAM MEEKE

by DR.G.RAMACHANDRAREDDY

₹100
In stock · 11 available
PublisherDR.G.RAMACHANDRAREDDY
LanguageTelugu
ఉద్యోగం మీకే 1. ఐదు లక్షల ఉద్యోగాలు! ఐటీ, స్టార్టప్లు ఫ్రెషర్ కు డిమాండ్ పెరిగింది: * దేశంలో 39,000 స్టార్టప్లు * ప్రతి ఏటా కొత్తగా 5 వేలు * హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయం * 2019 పై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ పాయ్ హైదరాబాద్ : భారత ఐటీ సేవల రంగం స్టార్టప్లు కలిసి కొత్త ఏడాదిలో 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు నియామకాలు జరిపే అవకాశం ఉందని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ అంచనా వేశారు. ఈ రంగాల్లో ఫ్రెషర్లకు డిమాండ్ పెరిగిందని, వచ్చే ఏడాది ఎంట్రీలెవెల్ ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోన్న స్టార్టప్లు వచ్చే ఏడాదిలో మరో 2 లక్షల మందిని ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశం ఉందని పాయ్ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో ఐటీ, స్టార్టప్లు కలిసి 3.5-4 లక్షల మేర సిబ్బందిని నియమించుకుని ఉండవచ్చని, అందులో స్టార్టప్ల హైరింగ్ 1.50 లక్షల స్థాయిలో ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 39,000 స్టార్టప్లు ఉ న్నాయని, ప్రతి ఏటా కొత్తగా 5 వేల వరకు స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయని పాయ్ తెలిపారు. మోహన్దాస్ పాయ్ ప్రస్తుతం మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వెంచర్ ఫండ్ సంస్థ ఆరిన్ క్యాపిటల్లో భాగస్వామి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డులో సభ్యుడు కూడా. దేశీయ ఐటీ ఇండస్ట్రీ మళ్లీ వృద్ధిబాటలో పయనిస్తోందని మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ఐటీ రంగ స్థితిగతులతోపాటు వచ్చే ఏడాదిపై, ఆయన ఇంకా ఏమన్నారంటే.. * ఈ ఏడాదిలో హెచ్1బీ వీసా నిబం ధనలు కఠినతరమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా మార్కెట్లపై దృష్టి పెంచాయి. బడా ఐటీ కంపెనీలు కార్యకలాపాలను భారీగా విస్తరించడంతో పాటు పెద్ద మొత్తాల్లో బైబ్యాక్ లు ప్రకటించాయి.