UKKUPADAM by MUKTHAVARAM PARTHASARADHI Telugu book cover

UKKUPADAM

by MUKTHAVARAM PARTHASARADHI

₹180
In stock · 101 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
UKKU PADAM by JACK LONDON జాక్ లండన్ రచించిన 'ఉక్కుపాదం' అద్భుతమైన, ప్రతిభావంతమైన రచన. సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ వచ్చిన నవలలు అనేకం వున్నాయి. బహుశా ఉక్కుపాదం మొదటి సైద్ధాంతిక రాజకీయ నవల. కాల్పనిక సాహిత్యం చదివేందుకు ఇష్టపడే అనేకమంది పాఠకులు తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం లాంటి వాటిని చదివేందుకు ఇష్టపడరు. 'ఉక్కుపాదం' ఈ సమస్యకు పరిష్కారం చూపింది. జీవిత సత్యాలను అన్వేషించదలచుకున్నవారికి ఇది చదవటం అనివార్యం. సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు వుండేటట్లు చూసుకోవల్సిన బాధ్యత వున్నది. అలాంటి కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం 'ఉక్కుపాదం'. ఉక్కు గట్టితనానికి, పటిష్ఠతకు చిహ్నం. 'ఉక్కుపాదం' అనగానే మనకు స్ఫురించేది కఠినమైన, నిర్దాక్షిణ్యమైన అణచివేత. పెట్టుబడిదారీ వ్యవస్థను వర్ణించేందుకు ఇంతకంటే సమగ్రమైన 'టైటిల్' మరొకటి స్ఫురించటం లేదు. 'ఉక్కుపాదం' ముక్తవరం పార్థసారథిగారు సమర్థవంతంగా అనువాదం చేశారు. నాకు తెలిసినంత వరకు తెలుగులో 'ఉక్కుపాదం' రచనకు నాలుగు వేరు వేరు అనువాదాలు వచ్చాయి. ఈ అనువాదం పుట్నోట్స్తో చేయటం దీని ప్రత్యేకత. శతాబ్దం క్రితం రచయిత ఏ సందర్భంలో వివిధ అంశాలను గురించి వివరించారో పుట్నోట్స్ లేకుండా అర్థం కాదు. కనీసం ఊహించటం కూడా అసాధ్యం. నవలలకు పుటో నోట్స్ ఇవ్వటం బహుతక్కువ. పరిశోధనా గ్రంథాలకు, సైద్ధాంతిక, చారిత్రక గ్రంథాలకు మాత్రమే ఇవి అవసరమౌతాయి. కాని ఇలాంటి రచన పుట్నోట్స్ లేకుండా అసమగ్రంగా ఉంటుంది. పుట్నోట్స్ లేకుండా చదివితే ఆ విషయాలు అర్థంకాక గబగబా ఆ పేజీలు దాటిపోయి పూర్తిగా అర్థం కాలేదని అసంతృప్తితోనే చదవటం ముగించాల్సి వస్తుంది. ఆ లోటును తీర్చి పుట్నోట్స్ ద్వారా దీనిని సమగ్రమైన రచనగా మలిచారు అనువాదకులు. అనువాదం అర్థవంతంగా ఉంది. ఆద్యంతం చదివించేదిగా ఉన్న ఈ రచన బిగి సడలకుండా తెలుగు పాఠకులకు అందించిన ముక్తవరం పార్థసారథిగారు అభినందనీయులు. వ్యవస్థ నడక అర్థం చేసుకోవాలన్న ఆసక్తిగలవారు, మార్చాలనే తపనగలవారు. మార్చటం కోసం పోరాటం చేసే ప్రతి విప్లవకారుడు తప్పక చదవతగిన రచన 'ఉక్కుపాదం'. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.