
UMA SAHASRAMU
by SRI RANGAVAJJALA VEERABADRARAO
₹300
In stock · 11 available
PublisherSRI RANGAVAJJALA VEERABADRARAO
LanguageTelugu
భగవాన్ శ్రీరమణ మహర్షి భగవాన్ శ్రీరమణ మహర్షి ది 29-12-1879న మార్గశిర కృష్ణ విదియనాడు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చుళిలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీ సుందరం. తల్లి శ్రీమతి అలఘమ్మ. రమణుల మొదటినామం 'వేంకటరామన్'. రమణులు ప్రాథమిక విద్య పూర్తి అయ్యాక పైచదువులకు పినతండ్రి అయిన సుబ్బయ్యరు ఇంటికి చేరాడు. రమణులకు మొదటినుండి చదువుపట్ల ఆసక్తి తక్కువ. ఆటలపట్ల మక్కువ ఎక్కువ. 1895లో చదువుకుండే రోజులలోనే అరుణాచలానికి ఆకర్షింపబడ్డాడు. పెరియపురాణం (శివభక్తవిజయం) అనేక మారులు చదివాడు. భక్తిమార్గంలో ప్రవేశించాడు. చడువు నిర్లక్ష్యం చేయడంతో పెద్దలు మందలించేవారు. 1896 జులైలో ఆయనకు విచిత్రమయిన మరణానుభూతి ఎదురు అయింది. నాటినుండి ఆత్మధ్యానంలోకి వెళ్తుండేవాడు. పాఠశాలకోసం ఇచ్చిన 5రూపాయలలో మూడు రూపాయలు ఉంచుకుని, రెండు రూపాయలు పొట్లం కట్టి, లేఖ రాసి, అరుణాచలానికి బయలుదేరాడు. "అప్పా! నీయాజ్ఞమేరకు వచ్చా" అని అరుణాచలేశ్వరునకు విన్నవించుకుని తననుతాను సమర్పించుకున్నారు. శిఖ, యజ్ఞోపవీతం తీసివేశాడు. కౌపీనం ధరించాడు. ధనాన్ని ముట్టేవాడు కాదు. ఎవరైనా పెడితే తినేవాడు. ధ్యానం చేసుకునేవాడు. అందరూ 'బ్రాహ్మణస్వామి' అని పిలిచేవారు. తల్లి వచ్చి ఇంటికి రమ్మన్నా మృదువుగా నిరాకరించాడు. 1899 నుండి 1916 వరకు విరూపాక్షగుహలో ధ్యానం చేశాడు. స్వామి మహిమను చుట్టుప్రక్కలవారు గుర్తించడం మొదలు పెట్టారు. ఆయన ప్రకృతితో కలిసి జీవించేవాడు. అన్ని జంతువులు ఆయనకు మిత్రులే.