UNNAMATA by M V R SASTRI Telugu book cover

UNNAMATA

by M V R SASTRI

₹200
In stock · 17 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట అ.జో- వి.భో ఫౌండేషన్ ఐదేళ్ళ కిందట తన ప్రచురణలకు శ్రీకారం చుట్టింది. సాహిత్య లోకంలో ఉత్తమాభిరుచులు, ఉన్నత ప్రమాణాలు అలవరిచే ఆశయంతో, మంచి పుస్తకాల కోసం నిరీక్షించే వారికి ఉత్సుకత పెంచేట్లుగా అపూర్వమైన కొన్ని పుస్తకాలు ఇప్పటికే ప్రచురించింది. క్రమంగా పుస్తక ప్రచురణ ప్రయత్నాన్ని విస్తరించాలని అ.జో. -వి. భో అభిలషిస్తున్నది. సమాజంలో పుస్తకాలు తెచ్చే, తేగలిగిన పరివర్తనం గణనీయంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేడు పఠనాసక్తి యువతలో తగ్గిపోతున్నది. ప్రసార మాధ్యమాల జోరు, ప్రచార ధోరణుల హోరు మధ్య ఉత్తమ సాహిత్యాభిరుచికి, సమాజ శ్రేయోదాయక దిశానిర్దేశానికి చేయవలసినంత ప్రయత్నం జరగటం లేదు. సంప్రదాయం తెలుసుకొని, సృజనాత్మక ప్రతిభ పెంచుకొని, సమాజావసరాల సమన్వయం సాధించవలసి ఉంటుంది. గతంలోని పరిణామాలను విశ్లేషించుకోవలసి ఉంటుంది. భవిష్యత్తు కోసం ఆశావహ నిరీక్షణం చేయవలసి ఉంటుంది. అప్పుడే వర్తమానంలోని ఒడిదుడుకులను సరిదిద్దుకునే సంయమం అలవడుతుంది అని అ.జో-వి.భో ఫౌండేషన్ వారి నమ్మకం. మరి ఈ ఆలోచనలు సమాజంలో వ్యాప్తి చెందించడం ఎట్లా? పుస్తకాల వల్లనే. అవి సమాజ బాధ్యతాయుతంగా ఉండాలి. అజ్ఞానం అంధకారమైతే విజ్ఞానం ఉషోదయాగమనం. శాస్త్ర విజ్ఞానం అత్యంత వేగంగా విస్తరిస్తున్నదిప్పుడు. ఒక దశాబ్దం నాటికి నేటికీ అన్ని రంగాలలో ప్రపంచీకరణ ప్రభావం ఎంతో కనపడుతున్నది. శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక యాంత్రిక పరిజ్ఞాన ప్రభావంతో మానవుడు మరింత సుఖశాంతి తత్పరుడు కావడానికి అవకాశముండగా, అనేక దుష్టశక్తుల తాకిడులతో హతభాగ్యుడవుతున్నాడు.