UNNATHA VIDYAKU UTTHAMA VIDYALAYALU by BHARANI PUBLICATIONS Telugu book cover

UNNATHA VIDYAKU UTTHAMA VIDYALAYALU

by BHARANI PUBLICATIONS

₹50
In stock · 10 available
PublisherBHARANI PUBLICATIONS
LanguageTelugu
ఉన్నత విద్యకు ఉత్తమ విద్యాలయాలు విశ్వవేదికపై మన ప్రతిష్ఠ ! ప్రపంచంలోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మనదేశంలోని మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. ఈ జాబితాలోని అత్యధిక విద్యాసంస్థలు (168) మాత్రం అమెరికాలోనే ఉన్నాయి. ఓ ప్రామాణిక సర్వే నిగ్గుదేల్చిన విషయమిది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, షాంగై జియావో తాంగ్ యూనివర్శిటీ (చైనా) 2005 సంవత్సరానికి ర్యాంకింగులను ఇటీవల ప్రకటించింది. పూర్వ విద్యార్థులు, సిబ్బంది, శాస్త్ర సంబంధ బహుమతులు, ప్రసిద్ధ జర్నల్స్లో ప్రచురించిన వ్యాసాలు మొదలైన విభిన్న అంశాల్లో విద్యా, పరిశోధన సంపత్తిని పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకులను నిర్ణయించారు. ఇవే ఆ విజ్ఞాన సౌధాలు ! : తొలి మూడు వందల ర్యాంకుల్లో మనకు స్థానం లభించలేదు. 301-400 ర్యాంకుల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూర్)కు స్థానం లభించింది. దీని మొత్తం స్కోరు 14.9 401-500 ర్యాంకుల జాబితాలో ఐఐటీ ఖరగ్పూర్కూ, (మొత్తం స్కోరు 11.6) యూనివర్శిటీ ఆఫ్ కలకత్తాకూ (మొత్తం స్కోరు 9.5) చోటు దక్కింది. పరిశోధనలో ప్రత్యేకత : ఐఐఎస్సీ : పరిశోధనకూ, అత్యాధునిక బోధనకూ అంతర్జాతీయంగా పేరుపొందిన సంస్థ బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్సెన్స్ (IISc). జె. ఎన్. టాటా దార్శనికతకు చిహ్నంగా 1909లో స్థాపితమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండువేలమందికి పైగా ఇక్కడ పరిశోధన చేస్తుంటారు. 411 1956 నుంచి ఇది డీమ్డ్ యూనివర్శిటీగా మారింది. సైన్స్ విద్యార్థులకు బయాలజికల్, కెమికల్, ఫిజికల్ సైన్సెస్లో ఇంటిగ్రేడ్ పీహెచ్ ప్రోగ్రాములను దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన సంస్థ ఇదే. శాస్త్రవేత్తలూ, సాంకేతిక నిపుణులకు స్వల్పకాలిక కోర్సులను కూడా అందిస్తోంది. ఉగ్రవాదుల దాడితో ఈ సంస్థ ఇటీవల వార్తలకెక్కిన సంగతి తెలిసిందే కదా! ສ໖໖໖: www.iisc.ernet.in శ్రేష్ఠతలో మేటి : ఖరగ్పూర్ ఐఐటీ 1950లో పశ్చిమబెంగాల్ లోని ఓ జైలు గదిలో ఈ ఐఐటీకి అంకురార్పణ జరిగింది. 1851 ఆగస్టులో 224 మంది విద్యార్థులూ, 42 మంది అధ్యాపకులతో ప్రారంభమైంది. ఇప్పుడిది 2700 మంది విద్యార్థులూ, 450