UPANISHAT SUDHALAHARI by YUVA BHARATHI Telugu book cover

UPANISHAT SUDHALAHARI

by YUVA BHARATHI

₹160
In stock · 9 available
PublisherYUVA BHARATHI
LanguageTelugu
ఉపనిషత్తుల ఉపదేశము "మహామహోపాధ్యాయ" ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఋగ్యజు: సామాథర్వవేదాలనే పేర్లతో నాలుగు వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క దికి అనేక శాఖలు ఉండేవి. మహాభాష్యాది ప్రాచీన గ్రంథాలలో లభించే పరిగణనం మారు ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 101 శాఖలు, సామవేదానికి 1000 ఆధర్వవేదానికి 9 శాఖలు ఉండేవి. యజుర్వేదానికి 109 శాఖలు, అథర్వవేదానికి * శాఖలు అని కొన్ని పురాణాలలో చెప్పబడినది. ఈనాడు చాల శాఖలు లుప్తములై యినవి. ఐదు ఋగ్వేదశాఖలు మాత్రమే ఇపుడు లభిస్తున్నాయి. వీటిలో కూడా కొన్ని అనుపూర్ణాలుగానే ఉన్నాయి. వేదాలన్నింటికీ మంత్రము, బ్రాహ్మణము అని రెండు విభాగాలున్నాయి. ముత్తవ్యాఖ్యానరూపం బ్రాహ్మణము. బ్రాహ్మణాలలోని కొన్నిభాగాలు, కొన్ని నియమాలు వాటిస్తూ అరణ్యంలో నివసించేవారు మాత్రమే పఠింపదగినవి అవడంచేత వాటికి అయ్యుకాలని పేరు. ఆరణ్యకాల చివరి భాగాలు ఉపనిషత్తులు. అందుచేతనే వీటికి తాలని కూడా పేరు. ఈశావాస్యోపనిషత్తు తప్ప ఈనాడు లభ్యమయ్యే అన్ని అపనిషత్తులూ కూడా అరణ్యకాల చివరి భాగాలకి చెందినవే. ఈశావాస్యోపనిషత్తు మాత్రం నక్షయజు: సంహితాభాగంలోనే ఉన్నది. పైన చెప్పిన అన్ని వేదశాఖలూ లభ్యమయ్యే పక్షంలో ఎన్ని శాఖలో అన్ని ఉపనిషత్తులు కూడా మనకు లభ్యమయి ఉండేవి. కాని ఇప్పుడు కొన్ని ఉపనిషత్తులు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ముక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తుల పేర్లు చెప్పబడి ఉన్నాయి. "