
UPANISHATTULU SRI VIDYA RAHASYALU
₹99
In stock · 24 available
PublisherDR.ARIPIRALA VISWAM
LanguageTelugu
అమృత బిందూపనిషత్ (కృష్ణ యజుర్వేదాంతర్గతము) కృష్ణ యజుర్వేద శాంతి పాఠము: ఓం - సహనావవతు - సహనౌ భునక్తు- సహవీర్యం కరవావహై తేజస్వి నావధీత మస్తు - మా విద్విషావ హై॥ ఓం శాంతిః శాంతిః శాంతిః మం. అమృత బిందూపనిష ద్వేద్యం యత్ పరమాక్షరం తదేవహి త్రిపాద్రామ చంద్రాఖ్యం నః పరా గతిః|| ఏది అయితే శాశ్వతాతి శాశ్వతమైనది, తెలుసుకోబడవలసినది ఉన్నదో అది అమృతబిందూపనిషత్. అనగా పరమాత్మను గూర్చిన ప్రచ్ఛన్నమైన ప్రజ్ఞానమును ఈ అమృత బిందూపనిషత్ ప్రసాదిస్తుంది. అది మూడు పాదములతో కూడి రామచంద్ర అనే పేరుతో విలసిల్లునట్టిది. అదియే మాకు పరమాం గతి అగు గాక! అని ప్రార్ధన చేస్తున్నాము. అమృత బిందువే శ్రీ మహా త్రిపురసుందరి. శ్రీ చక్రేశ్వరి. అమ్మవారికి శ్రీ రామా అన్న పేరున్నది. 1. ఓం. మనోహి ద్వివిధం ప్రోక్తం, శుద్ధంచా శుద్ధమేవచ అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామవివర్ణితమ్॥ మనస్సు శుద్ధమని, అశుద్ధమని రెండు విధములుగా చెప్పబడుచున్నది. సంకల్పములను కూడి ఉన్నది అశుద్ధమైన మనస్సు. నిస్సంకల్పమైన మనస్సు శుద్ధ మనస్సు. ఇచ్చట అశుద్ధము అనగా మాయా కల్పిత చైతన్యము అని అర్థము. మాయ అనగా ఆది మధ్యాంతములు గలది. గుర్తుపట్టగలిగి, అనుభవించగలిగేటటువంటి గుణ వస్తు భావనాత్మకమయినది మాయ. తద్గతమైన వస్తువు ఏది అయినప్పటికీ అది మాయాంతర్గతమే. అట్టి మాయాంతర్గతమయిన వస్తువుల యందు కామము ఉపనిషత్తులు - శ్రీవిద్యారహస్యాలు