
UPAYAM PILLALA KATHALU BOMMLATHO - 35
₹35
In stock · 605 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నిజమైన స్నేహం వెల్లంకి గ్రామంలో నివసించే నరసింహం అనే శ్రీమంతుడికి ఏకైక సంతానం వెంకటరమణ. యుక్త వయసు వచ్చిన వెంకటరమణకు చాలా మంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళలో కొంతమంది ఎల్లప్పుడూ అతని చుట్టే తిరుగుతుండేవారు. వెంకటరమణ స్నేహితుల గురించి నరసింహానికి సందేహంగా ఉండేది. వాళ్ళంతా డబ్బు చూసి అతనితో స్నేహం చేస్తున్నారనిపించింది. వెంకటరమణ కూడా మిత్రుల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేవాడు. ఓసారి నరసింహం కొడుకుతో “నీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండు. నిజమైన స్నేహితులను గుర్తించి మసలుకో” అన్నాడు. అందుకు వెంకటరమణ “లేదు నాన్నా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు. నాతో తప్ప ఇంకెవరితో