UPPUNUTHALA NARASIMHAREDDY KATHALU by UPPUNUTHALA NARASIMHAREDDY Telugu book cover

UPPUNUTHALA NARASIMHAREDDY KATHALU

by UPPUNUTHALA NARASIMHAREDDY

₹300
In stock · 50 available
PublisherUPPUNUTHALA NARASIMHAREDDY
LanguageTelugu
ముందుమాట ప్రజాజీవితంలో జరుగుతున్న పరిణామాలు, నా అనుభవాలు కొన్ని కథలకు ఆధారం. మిగతావి ఊహాజనితాలు. పల్లెటూరి "బాస" యాసలో పెరిగాను. 1960-63 మధ్యకాలంలో నిజాం కాలేజీలో చదివాను. అక్కడ డాక్టర్ సి. నారాయణరెడ్డి గారు మాకు తెలుగు లెక్చరర్. ఆ క్షణాలే నాలో భావుకతను, కొత్త భాష్యన్ని చిగురింపజేసాయి. ఆ స్ఫూర్తి నుండి వచ్చినవే నా రచనలు. నారాయణరెడ్డి గారు చిత్రసీమలో అడుగుపెట్టింది ఆరోజుల్లోనే. ఆయన మొట్టమొదట తెలుగు సినీ గీతాలు 1961లో విడుదలైన రామారావుగారి గుళేబకావళి చిత్రంలో. ఆయన మొదటి గీతం "నన్ను దోచుకుందువటే" మా విద్యార్థుల హృదయాలను శాశ్వతంగా దోచుకుంది. నారాయణరెడ్డి గారి వాచకం, చతురత, మధురమైన గొంతు, కవితాత్మకంగా, కమ్మగా పలికే ఆయన వాక్కులు వినటానికి ఆ ఒక్క తెలుగు క్లాసు కోసం కాలేజికి నాలా ఎందరో విద్యార్థులు వచ్చేవారు. అలాంటి 'ఇంగువ' కట్టిన గుడ్డను నేను. ఆయన దీవెనలతో ఈ కథల సంపుటి పాఠకుల కందాలనేది నా ప్రగాఢ వాంచ నా రచనలు మూడు రకాలుగా విభజించి ముద్రించటం జరిగింది. 1. మానవీయం 2. శృంగారం, 3. రాజకీయం. సహృదయంతో ఆస్వాదించి, ఆదరించ మనవి.