URDU KAVULA KAVITAA SAMAGRI by BPI INDIA PVT LTD Telugu book cover

URDU KAVULA KAVITAA SAMAGRI

by BPI INDIA PVT LTD

₹120
In stock · 12 available
PublisherRAVI PUBLISHING HOUSE
LanguageTelugu
మిత్రవాక్యం బహురూప ప్రజ్ఞాశాలిని నిర్వేశేషుని చేయటం కుదరదు. ఇటీవలే కీర్తిశేషులయిన సామల సదాశివుల విషయంలోను చిక్కు ఇదే. సామల చదువుల సామి. నిర్విరామ విద్యార్థి. అనగా జ్ఞానపిపాసి, ఆయన చదువుల తల్లి చల్లని చూపుతో పొందిన ప్రతిభను విశేష స్వయంకృషితో వికసితం చేసుకున్నాడు. ఫలితంగా ఆయన గాయకుడు, చిత్రకారుడు, కవి, బహుభాషా సాహిత్యవేత్త. సమీక్షకుడు, సంగీత శాస్త్రజ్ఞుడు ఇత్యాది. సామల ప్రస్తుత రచనలో 18 మంది ఉర్దూ కవుల వరిష్ఠ కావ్యకర్తల లఘు పరిచయం చేయటం జరిగింది. వారి కవితా సామగ్రికి నేపథ్యం ఏమిటో సుపరిచయం చేయటమూ జరిగింది. ఆ నేపథ్య ప్రసంగంలో ఉర్దూ కవిత్వ ప్రక్రియలు, తత్ సంప్రదాయాల యవనిక వెనుక గల యవన సంస్కృతి. వర్ణనా రీతులు, కవి సమయాలు, మొ॥ చర్చించటం సాగింది. 'గజలు' ఏమిటో 'రుబాయి' ఏమిటో ఉదాహృతులతో ఉల్లేఖించటమయింది. జలాలుద్దీన్ రూమీ మస్నవీ (పారసీ), అన్జద్ హైదరాబాదీ రుబాయీలను తర్జుమా చేశారు. అందులోని తసవుఫ్ (సూఫీ తత్త్వం) భారతీయ అద్వైత ప్రచ్ఛాయలు కలదిగా అవబోధ మవుతుంది. కవితా తత్త్వవేత్త, తత్త్వకవితావేత్త అయిన వేలూరి శివరామశాస్త్రి సామల సదాశివ అనువాద, విశేషమును అనుపమయినదిగా ఆదరించారు; ఉర్దూలోని కాఫియా పద్ధతిని సామల తేటగీతుల్లో గీయటం భవ్యంగా ఉన్నట్లు భావించారు. సదాశివ 'నిరీక్షణ' ఖండకావ్యం ఆలకించి సురవరపు ప్రతాపరెడ్డి చేసిన ఒక సూచనాప్రేరణతో సామల ఈ ఉర్దూకవుల కవితాసామగ్రి (1970), ఫారసీ కవుల ప్రసక్తి (1975), మీర్జా గాలిబు (జీవితరచనలు), ఉర్దూ భాషా కవిత్వ సౌందర్యం (2004), ఉర్దూ సాహిత్యం (2007) విరచించి తెలుగు భాషీయులకు అపూర్వసేవ చేసిన వారయ్యారు. ఈ రచనలు పరిశోధనాత్మకమైనట్టివి. ప్రశంసాస్పదమయినట్టివీ. ఇక సంకలనకర్త ప్రభాకర్ స్వయం ఉర్దూ కవి కావటం, గ్రంథం చివర తన రచననొకదాన్ని జోడించటం సంకలనానికి ఒకింత శోభను చేకూర్చింది.