
URENIUM PALLE
₹100
In stock · 9 available
PublisherDR.VEMPALLI GANGADHAR
LanguageTelugu
'నాయనా... యురేనియం అనేది మన భూముల్లోనే ఎందుకు పడింది..?” అని అడిగినాడు ఐదో తరగతి చదివే కొడుకు సాంబుడు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మెరుస్తాండయి. కొడుకు అడిగిన ప్రశ్నకు వెంకటేశు గుండెల్లో రాయి పడినట్లైంది. తన భూమి కూడా ఎకరంన్నర యురేనియం ప్రాజెక్టు కిందికి పోతాంది. ప్రశ్న వుంది. దానికి జవాబే తన దగ్గర లేదు. వెంకటేశుకు తలనిండా ఏవేవో ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు. ఆకాశాన్ని తను చూస్తున్నాడా? తనని ఆకాశం చూస్తుందా?