USHA NIRNAYAM by KANDUKURI VENKATA MAHALAKSHMI Telugu book cover

USHA NIRNAYAM

by KANDUKURI VENKATA MAHALAKSHMI

₹75
In stock · 3 available
PublisherKANDUKURI VENKATA MAHALAKSHMI
LanguageTelugu
ముందుమాట బరువైన జీవితాలకు ఇంపైన కథాకథన శిల్పం ఎక్కడో మొదలు పెట్టి - యేదో రాసుకుంటూ సన్నివేశాలు అల్లుకుంటూ పోయి, చివర ఒక ఆశ్చర్యార్ధకమో, ప్రశ్నార్ధకమో, పెట్టి పత్రికకి త్రోసేసి - అదే కథ అనేవాళ్లు ఎప్పుడూ వుంటారు. కాని, అచ్చులో పడ్డ కథలన్నీ పదికాలాల పాటు నిలిచేవి కావు. అలా అని, పడ్డ కథలన్నీ చెడ్డ కథలూ కావు. పత్రికలలో ప్రచురణ అయే కథలలో ఎన్నో మంచి కథలుంటాయి. తెనుగు వాళ్లకి కథలు కొత్త కాదు. కాని, వెనుకటికి కథలన్నీ కంచికి పోయేవి ఇప్పటి, కథలు అనండి లేదా కథానికలు అనండి యివి అందుకే మంచి కథలన్నీ సమాజంలోకి పోయి, అక్కడే బ్రతకాలి. సంపుటాలుగా రావాలి. అలా రాకపోతే, ముందు తరాలకి అవి దక్కవు. ఈ విషయంలో చెయ్యి తిరిగిన కథా శిల్పి శ్రీమతి కందుకూరి వేంకటమహాలక్ష్మి. ఇప్పటికే ఆలశ్యం చేశారు. ఆమె యించు మించు అన్ని ప్రముఖ వార, పక్ష, మాస పత్రికల లోనూ గడిచిన పాతిక సంవత్సరాలకు పైగా కథానికలు రాస్తూ వచ్చిన సోదరి. మహలక్ష్మి కథలనెన్నింటినో నాడే నేను పరిశీలించాను. ఆమె నిర్మొహమాటంగా, యితివృత్తాన్ని అనుకున్న దిశలో, అనుకున్న గమ్యానికి చేరే విధంగా రాయగల నేర్పరి! అటు యింటినీ, యిటు సాహితీ వ్యాసంగాన్నీ చక్కగా తీర్చిదిద్దిన దొడ్డ యిల్లాలు ఆమె. అక్కడ, అంతెత్తున మన రాజధాని నగరంలో కొత్త ఢిల్లీగా వాసికెక్కిన మహానగరంలో వున్నా తెలుగు సంఘానికి మన తెలుగు జీవితానికీ ఆమె 'కలం' నిరంతరం సన్నిహితంగా వుంటూ ఎన్నో సజీవ కథా చిత్రాలను తీసి మనకి అందిచింది. శ్రీమతి మహలక్ష్మిగారి కథలలో మన పట్టణ వాసపు వాసనలతో పాటు మరో ప్రత్యేకత కూడా వుంది. అదే 'టెంపో'. ఏ కథ తీసుకున్నా మీరు ఉదాహరణకి 'మానవుడే దేవుడైతే' కథ, లేదా, 'నేరం నాదీ - శిక్షనీది' కథని గానీ తీసుకోండి. మొదలెట్టిందెగ్గర్నుంచి ముగింపుదాకా -