
USHAKIRANALU
₹100
In stock · 5 available
PublisherANANTHA RAMACHANDRAIAH
LanguageTelugu
నా మాట కథలను వ్రాయలనిపించినపుడు రచయితకి ఎదురయ్యే సమస్య 'వైవిధ్యం' సాదాసీదా అంశంతో వ్రాయడం నాకు ఇష్టం లేదు. అందుకే వ్రాసిన ప్రతికథలో వైవిధ్యం చూపించాలని ఆరాటపడ్డాను. ఆ కథల్ని ప్రచురణలో చూడాలని ఉ బలాట పడ్డాను. అవి అందరికీ నచ్చాలని ఉవ్విళ్ళూరాను. ఇవన్నీ జరిగాయి. అలాంటి నాకథలకి పుస్తకరూపం ఇవ్వాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఈ సంపుటి! వైవిధ్యభరితమైన నా కథలకు ఆహ్వానం పలికిన ఆంధ్రభూమి సంపాదకులు ఎమ్.వి.ఆర్.శాస్త్రిగార్కి, ఆంధ్రప్రభ సంపాదకులు పి.విజయబాబుగార్కి, ఆంధ్రప్రభఉప సంపాదకులు డి. గోపాలకృష్ణ గార్కి, మయూరి వార పత్రిక సంపాదకులు డి. భీమ్డ్డి గార్కి పవిత్ర మాసపత్రిక ఉపసంపాదకులు జి.చంద్రశేఖర్ గార్కి, సుప్రభాతం ఉప సంపాదకులు అర్జున్ గార్కి యజ్ఞం సంపాదకులు ఓంకార్ గార్కి తరుణి మాస పత్రిక సంపాదకులు శశిగార్కి, బాలచంద్రిక మాసపత్రిక సంపాదకులు చొక్కాపు వెంకటరమణ గార్కి నా తెలంగాణ వారపత్రిక సంపాదకులు కలిమిశ్రీ గార్కి నా ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు. నా కథలను చదివి సంతృప్తిని వ్యక్తపరిచి తమ అమూల్య అభిప్రాయాలను తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే, రచయిత్రి శ్రీమతి ఎస్. స్వర్ణ సుధాకర్ రెడ్డి గార్కి (అమరచింత), కవి పండితులు డా|| కె. బాలస్వామి (మరికల్) గార్కి ఆంగ్లోపన్యాసకులు, రచయిత, వ్యాఖ్యాత, గాయకులు శ్రీనారాయణ డి.వి.వి.ఎస్. (వనపర్తి)గార్కి, గ్రంథపరిష్కర్త డాక్టర్ వుందేకోడ్ రత్నయ్య (మహబూబ్ నగర్)గార్కి ఈ పుస్తక రూపశిల్పి హిమాలయ గ్రాఫిక్స్ అధినేత శ్రీ సూర్యచంద్రారెడ్డి గార్కి, ఈ పుస్తక తయారీలో సహకరించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. అనంతరామచంద్రయ్య