USHASSU by KOORA CHIDAMBARAM Telugu book cover

USHASSU

by KOORA CHIDAMBARAM

₹70
In stock · 3 available
PublisherKOORA CHIDAMBARAM
LanguageTelugu
కథారచనకు ఒక సంఘటన మూలం. జీవితంలో అనేకానేక సంఘ టనలు జరుగుతుంటాయి. వాటిలో చెప్పుకోదగ్గ విశేషం ఉన్నప్పుడు, అసాధారణంగా ఉన్నప్పుడు కథారూపం ఇస్తారు. సాధారణంగా కనిపించే సంఘటనల్లో మనకు తెలియకుండానే అసాధారణాంశాలు ఉంటాయి. వాటిని కథకులు మాత్రమే చూడగలరు. అక్షరరూపంలో పెట్టగలరు. కూర చిదంబరంగారు సరిగ్గా అదే పనిచేశారు. మనం చూస్తూ కూడా ఉపేక్షించే విషయాల్ని కథలో చదివినప్పుడు విస్తుపోతాం. విస్మయానికి లోనవుతాం. ఇలాంటి అంశాలే చిదంబరం గారి కథల్లో కనిపిస్తాయి. రచయిత కథాకథనంలో చూపిన నేర్పు, కథలకు పెట్టిన శీర్షికలు కథల్ని చదవాలన్న ఉత్సుకతను కలిగిస్తాయి.