
UTTARA RAMACHARITAM
₹250
In stock · 1 available
PublisherAJO-VIBHO KANDALAM
LanguageTelugu
ఈ ఉత్తర రామచరితానికి చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. సంస్కృతంలో ఆంగ్లంలో హిందీలో తెలుగులో. అలాగే చాలా అనువాదాలు వచ్చాయి. ఎందరెందరో విమర్శనాత్మక - పరిశోధనాత్మక వ్యాసాలు వెలయించారు. వీటినుంచి నా వ్యాఖ్యానం ఎంతగానో లబ్ధి పొందింది. ఆయా తావుల్లో దాన్ని ప్రస్తావించాను. కనక భవభూతితో మొదలు పెట్టి వీరందరికీ శిరసా నమస్కరిస్తున్నాను. నా పఠనపాఠనాలూ రచనావ్యాసాంగమూ నిరాటంకగా సాగడానికి అనువుగా మనోధైర్యాన్నీ ప్రశాంతినీ అనుగ్రహిస్తున్న జగద్గురువులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి శ్రీచరణారవిందాలకు కృతజ్ఞతా పూర్వకంగా సాగిల పడుతున్నాను. గ్రంథం మీద అభిమానంతో నా పట్ల స్నేహంతో విలువైన సమాచారమూ లోతైన విశ్లేషణా కలగలిపి మంచి పీఠిక అందించిన అగ్రజులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారికీ (శ్రీకంఠశర్మ అని వీరి నాన్నగారి అభిప్రాయం); అంకకథలను సులభసుందరంగా సమకూర్చిన మిత్రులు డా॥ అద్దంకి శ్రీనివాస్ గారికి; ముద్రణ బాధ్యతను స్వీకరించిన అజో-విభో-కందాళం ఫౌండేషన్వారికీ, విశేషించి శ్రేయోభిలాషులు అప్పాజ్యోస్యుల సత్యనారాయణగారికీ చారిగారికీ; ప్రతిభా పక్షపాతానికి పెట్టింది పేరుగా నిలబడే మా వైస్ ఛాన్సలర్, విశ్వవిఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త, సంగీతసాహిత్యాభిమాని, నిరంతర క్రియాశీలి, పద్మశ్రీ బిరుదాంకితులు డా|| సయ్యద్ ఇ. హస్వైన్ గారికి (తన భాష కాకపోయినా విలువ ఎరిగి 'really it is an honour to me' అని లేచివచ్చి 'హాసనయనాలతో' కరచాలనం చేసి) కృతిపతిత్వాన్ని అంగీకరించినందుకూ; శ్రమకోర్చి అందంగా డిటిపి చేసిన శ్రీసాంబా ఎంటర్ప్రైజెస్ (చీరాల) వారికీ, చదవబోతున్న పాఠకమహాశయులకూ కృతజ్ఞతాభివందనాలతో....