UTTARA TELANGANA MUDU DASHABDALA KATHA by DR.AKUNURU VIDYA DEVI Telugu book cover

UTTARA TELANGANA MUDU DASHABDALA KATHA

by DR.AKUNURU VIDYA DEVI

₹150
In stock · 8 available
PublisherVIDYANANDA PRACHURANALU
LanguageTelugu
నా మాట... ప్రస్తుత సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాహిత్య చరిత్ర నేపథ్య ఏదైనా ఒక అంశముతో పరిశోధన చేయాలని ధ్యేయంతో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ కథ సాహిత్యం గురించి పరిశోధన అనుకున్నపుడు కొంత కాలపరిమితి ఉంటే సమగ్రమైన న్యాయం చేయగలననే ఆలోచనలతో ఉత్తర తెలంగాణ కథలు (1970-2000) సమగ్ర పరిశీలన" అనే శీర్షికతో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నాను. ప్రస్తుతం గ్రంథమునకు శీర్షికను కొద్దిగా మార్పుచేసి ప్రచురిస్తున్నాను. నాకు పర్యవేక్షకులుగా అంగీకరించి, సహకరించిన ఆచార్య బన్న ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలోని అందరికి ధన్యవాదాలు అందజేస్తున్నాను. నా పిహెచ్. డి. పట్టాను పొందిన సమయంలో నా ఎదుగుదలను ప్రత్యక్షంగా చూడలేకపోయిన మా అమ్మా-బాబులకు అలాగే మా పెద్దన్నయ్య-వదినలకు, మేనమాను దేవులపల్లి సుదర్శన్రావు మరియు మామయ్య సింగరాజు కృష్ణారావు వార వెలితి మరిచిపోలేనిది. నా ఉన్నతికి అడుగడుగునా ప్రోత్సహిస్తూ ఆలస్యం చేసినపుడు సున్నితంగా మందలించిన ఆత్మీయబంధువు శ్రీ రంగస్వామి అన్నయ్య, వారి సతీమణి శ్రీలక్ష్మి వదినకు, నా పై చదువులకు ప్రోత్సాహం, సహకారం అందించిన మరో ఆత్మీయ సోదరులు శ్రీహరన్నయ్యకు, వారి కుటుంబ సభ్యులకు, మా అత్తగారు శ్రీమతి విజయలక్ష్మి గారికి, నా హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు, బంధువర్గం, తోటి ఉద్యోగులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పరిశోధన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ ప్రాంత కథకులు ఎందరినో కలుసుకునే మహాద్భాగ్యం నాకు కలిగింది.