UTTARA VAYUVYA VEEDHICHOOPU VAIBHAVAMULU by TUMATI BRAHMAIAH CHOWDARI Telugu book cover

UTTARA VAYUVYA VEEDHICHOOPU VAIBHAVAMULU

by TUMATI BRAHMAIAH CHOWDARI

₹200
In stock · 11 available
PublisherTUMATI BRAHMAIAH CHOWDARI
LanguageTelugu
శ్రీ తూమాటి బ్రహ్మయ్య గారు ఈ ‘ఉత్తర వాయువ్యవీధిచూపు వైభవములు' అన్న గ్రంథం ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం కలిగించే మాట యదార్థం అయినా నా అరుణాచల సహిత వాస్తు గ్రంథమే ఎంతో వినూత్నంగా వ్రాసినందున పాఠక మహాశయులనే కాక ఎంతోమంది మేధావుల ప్రశంసలు పొంది ఎక్కడా ఏ ప్రచారం లేకపోయినా ఆ గ్రంథం గొప్పతనమే నన్ను 5 రాష్ట్రాలలో జైత్రయాత్ర చేయించి నా కెంతో ఆనందాన్ని కలిగించి రెండోముద్రణకు కూడా రావటం అదృష్టం, నా తీవ్రాతి తీవ్ర కృషి ఫలితం కూడా. అలాగే ఆంధ్రలో ఇప్పటివరకు ఆదిగురువు శ్రీ ముద్రగడ రామారావు గారి నుండి ఎంతోమంది ఉత్తర వాయువ్య వీధిచూపు తప్పని వ్రాసినా వాస్తు ఋషీంద్రులు నేలపాటి సిద్ధాంతిగా పేరొంది తను వాస్తుకు పైసా ముట్టకుండా సుమారు 60 ఏళ్ళ ఉచిత సేవ చేసి ఆంధ్రలో రెండో శ్రీసాధురాంజీగా పేరొందిన కీ.శే. శ్రీ గుజ్జర్లపూడి సుబ్బారావు గారి శిష్యరికంలో ఈ వీధిచూపు అన్ని చూపుల్లో కన్నా అత్యధికమైన ఫలితాలు ఇస్తున్నదని గ్రహించి వారి దివ్యాశీస్సులతో ఎన్నెన్నో రుజువులతోనే ముద్రించి మీ ముందుంచాను. నాకు తీరని కోర్కె ఒక్కటే. ఈ గ్రంథాన్ని చూసుకోకుండానే ఫిబ్రవరి 19న అమరులైనారు. ఎంతోమంది ఉన్నతమైన కళాకారులను కన్న ఈ దివ్య గుడిపూడి గ్రామంలో ఈ గ్రంథం బైటకు రావటం కూడా ఈ గ్రామం గొప్పతనంగానే భావిస్తూ, ఎవరికి వారు ఎక్కడికక్కడే ఈ చూపు వైభవాన్ని గ్రహించగలందులకై ప్రార్థిస్తూ..... మీ తూమాటి బ్రహ్మయ్య చౌదరి