
UYYALAVADA NARASIMHA REDDY
by S.D.V.AZEEZ
₹25
In stock · 1 available
PublisherS.D.V.AZEEZ
LanguageTelugu
ప్ర పంచ చరిత్రలో దండయాత్రలు జరిపి, ఇతర రాజ్యాలను ఆక్రమించుకొన్న సంఘటనలు ఎన్నోవున్నాయి. అయితే ఆంగ్లేయులు వ్యాపారం పేర, మన దేశానికి వచ్చి మనలో వున్న అనైక్యత కారణంగా, “విభజించు పాలించు" అన్న సూత్రంతో, సువిశాలమైన భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఇది అరుదైన సంఘటన. క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి క్రీ.శ. 19వ శతాబ్దం దాకా వారి పాలన మనదేశంలో నిర్విఘ్నంగా కొనసాగింది. క్రీ.శ. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే సరియైన నాయకత్వం లేని కారణంగా ఆ ఉద్యమాలను ఆంగ్లేయులు అణిచివేశారు. మన చరిత్రకారులు 1857 సిపాయిల తిరుగుబాటు నుంచే స్వాతంత్రోద్యమ చరిత్రను లిఖించారు. అయితే అంతకు మునుపే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. 10 క్రీ.శ. 1799లో బ్రిటీషు వారితో జరిగిన నాల్గవ మైసూరు యుద్ధంలో, 'మైసూరు బెబ్బులిపులి'గా పేరు గాంచిన టిప్పు సుల్తాన్ కన్ను మూశాడు. ఆంగ్లేయుల ఆనందానికి అంతేలేదు. బ్రిటిష్వారికి అనుకూలంగా నిజాం నవాబు వ్యవహరించి, టిప్పుసుల్తాన్ కు వ్యతిరేకంగా తన సైనికులను ఆంగ్లేయులకు తోడుగా పంపటంవల్ల,