
V-1 SIVAREDDY KAVITHA
by SIVAREDDY
₹225
In stock · 34 available
PublisherJHARI POETRY CIRCLE
LanguageTelugu
మైనం కరగందే... నరాలన్నీ Shake అయి పేగుల్లో సముద్రాలు దొర్లి, దొర్లి సంచలనం ఆకాశాలు కదిలి, కదిలి నా రక్తం దిక్కులన్నీ పిక్కటిల్లి చెట్లన్నీ కూలికూలి దొర్లిదొర్లి గోళాలన్నీ Clash అయి నేత్రాల్లో నే నుంచున్న రోడ్డు పామయి- జారిజారి గర్భకుహరాల్లో తెమిడి, తెమిడి తట్టుకోవటం కష్టమయి సమస్త శరీరం మేఘాలయి- ముద్దయి భోరున కళ్ళతో దుఃఖించి- తల రెండు చేతుల కత్తుల మధ్య ఇరికించి వత్తుకుంటూ-అలజడులు ప్రళయాలు అక్కడికక్కడే బద్దలయి నుంచున్న ఉదయమే ఘోరాంధకార బంధురమై-చీకటి దుప్పటిలో చుట్టేసి ఎవరో వత్తేస్తున్నారు. ఊపిరి కోసం, గాలి కోసం అరిచి- పోరాడి-ఈ సన్నని నాజూకైన రాంములక్కాయ పగిలిపోయింది-తరమటం- తరమటం- గుండెల్ని కొరకటం-అసహ్యం, డోకులు అలల్లా, పొగలా లేచి నన్ను ముంచి- కళ్ళు బైర్లు కమ్మి స్వస్థత, ఉలిపిరి కాగితం శాంతి చినిగి కూలబడి కళ్లు తెరిస్తే శివారెడ్డి కవిత -