V-2 KRISHNAMOHAN KADHA SRAVANTHI by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO Telugu book cover

V-2 KRISHNAMOHAN KADHA SRAVANTHI

by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO

₹150
In stock · 190 available
PublisherDR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
LanguageTelugu
ప్రముఖ సినీ నటులు, రచయితలు శ్రీ ఎల్.బి. శ్రీరాం గార్ని నా ద్రాక్షారం కథల గురించి రెండు ముక్కలు రాయమని కోర్డూ పనిలో పనిగా అప్పటికే ప్రింటయిపోయిన నా ఆత్మ కథ కాపీ ఆయన చేతికిస్తే దాన్నాయన ఓపిగ్గా చదివేసి వేయి పడగలంతుందని కాంప్లిమెంటిచ్చేసేరు. నా ఐదు కథా సంపుటుల్లో మొదటి రెండు ద్రాక్షారం కథలు, తూగోజి కథలు 2008లోను, మూడు నాలుగు - కోనసీమ కథలు, తూర్పు గోదావరి కథలు 2009లోను, అయిదోది బ్రహ్మదేవుడూ సునాడే 2018లోను పుచురించాను. మొత్తం కథలు 123. మొదటి నాల్లు సంపుటాలు పూర్తిగా అమ్మకమైపోయి నన్ను ద్వితీయ ముద్రణ దిశగా ప్రోత్సహించాయి. ఆ సంపుటులకు పెట్టిన టైటిల్సు, వలన కొంత గొందరగోళం ఏర్పడింది. ఉదాహరణకు అఖండ గోదావరి పాయలు గౌతమి, వసిష్టుల నడుమనుండే చిన్న భాగం కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోనిదే కాని కోనసీమ అంటే మొత్తం తూర్పుగోదావరే అని చాలమంది అనుకొంటారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు భద్రాచలం తూగోజిలోనిదే అన్నదీ వారికి తెలియదు. అందువలన ద్వితీయ ముద్రణలో (కంపైల్డ్ ఎడిషన్లు) కృష్ణమోహన్ కథాసవంతి భాగం - 1 భాగం - 2 అని టైటిల్సు పెట్టవలెనని మిత్రులు సలహా ఇచ్చారు. కంపైలు ఎడిషన్లలో 123 కథల్ని 90కి కుదించేను. 68 సంవత్సరాలొచ్చేవరకు రచనా వ్యాసంగం పెట్టుకోక తర్వాతి మూడేళ్ళలో 123 కథలు రాపిపిన నేను నా గురించి రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. ఎందుకంటే యీ కథలకు మూలాధారం అదే. ఎలిమెంటరీ స్కూలే లేని ముప్పై గడపలన్నా దాటని విలాస గంగవరంలో పుట్టి మిడిల్ స్కూల్ అయ్యేదాక ఆ చుట్టుపక్కలూర్లలో మురిక్కాలవగట్ల వెంట, చేలగట్ల మీద నడక సాగిస్తూ చదువు లాగించిన నాకు ఆ మట్టి వాసన, ఆ మట్టి మనుషుల మాండలికం బాగా వంటబట్టాయి. కాకివాడ హైస్కూల్లో కాలేజీలో చదివేప్పుడు తెలుగు వచన సాహిత్యాన్ని వడగట్టేశానన్న గొప్పి కాని వంటబట్టిందేమీ లేదు.