V-2 PRAPANCHA COMMUNIST UDYAMAM DANI PARINAMAM by CHANDRA PULLA REDDY Telugu book cover

V-2 PRAPANCHA COMMUNIST UDYAMAM DANI PARINAMAM

by CHANDRA PULLA REDDY

₹185
In stock · 237 available
PublisherNUTANA SAKTI PRACHURANALU
LanguageTelugu
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఈ గ్రంథంలో వివరించారు. 1965-66 సంవత్సరాలలో జైళ్లో డిటెన్యూలుగా జీవిస్తూ కామ్రేడ్స్ చండ్రపుల్లారెడ్డి, మానికొండ సుబ్బారావుగారలు జరిపిన సమిష్టి కృషి ఫలితంగా ఈ గ్రంథం రాశారు. జైళ్లలో రాజకీయ బాధితులకు అవసరమైన రాజకీయ గ్రంథాలను, అభ్యుదయ సాహిత్యాన్ని రానివ్వరు. అయినప్పటికీ ఈ ఆటంకాలను అధిగమించి కృషి సల్పినందుకు వారిని అభినందించాలి. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో గత 20 సంవత్సరముల నుండి బహిరంగ చర్చలు జరుపుతున్నవి. సిద్ధాంత, రాజకీయ సమస్యలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపైన ఈ చర్చలు సాగుతున్నాయి. యుద్ధమూ శాంతీ, అణ్వస్త్రాల నిషేధమూ, విముక్తి పోరాటాలూ, పార్లమెంటరీ పంథా, వర్గ పోరాటాలు, కార్మికవర్గ నాయకత్వ పాత్ర మొదలుగాగల అంశాలపై ఈ చర్చలు ప్రారంభమై నేటికీ సాగుతున్నాయి. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో తలెత్తిన రివిజనిస్టు రాజకీయాల ప్రభావం అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలపై పడింది. రివిజనిస్టు పెడధోరణి దాడి ఫలితంగా అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలు కలుషితమైనాయి. దీని పర్యవసానంగా కొన్ని కమ్యూనిస్టు పార్టీలు రద్దయినాయి. గత పది సంవత్సరాల కాలంలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నింటినీ ఈ పుస్తకంలో చేర్చడం సాధ్యం కాలేదు. ముందు ముందు ఈ కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సి వుంది. ఇటీవల సంవత్సరాలలో వందల వేల సంఖ్యలో యువకులు, విద్యార్థులు, శ్రమ జీవుల వర్గ పోరాటాలలో సమీకృతులైనారు. వివిధ దశలలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో తలెత్తిన పెడధోరణులను ఈ గ్రంథంలో రచయితలు పరిశీలించారు. అందుచే ఈ గ్రంథం పాత-కొత్త తరాల వారందరికీ ఎంతో విలువైనది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిజం ప్రధాన పెడధోరణిగా ఈనాటికీ కొనసాగుతున్నది ఫలితంగా కమ్యూనిస్టు శ్రేణుల్లో అనేక సందేహాలు, సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల విషయంలో సరైన సిద్ధాంత, రాజకీయ అవగాహనను ఏర్పర్చుకోవడానికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని తిరిగి ముద్రిస్తున్నాము. అంతేగాక ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను తెలుగు పాఠకులకు సవివరంగా ఈ గ్రంథం వివరిస్తుంది. తద్వారా వాస్తవ పరిస్థితులపై ఆధారపడి తమ విప్లవాచరణను మలచుకోవడానికి తోడ్పడుతుంది. 1.3.1979 ఇట్లు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు కమిటీ (ఎం.ఎల్)