V-2 SIVAREDDY KAVITHA by SIVAREDDY Telugu book cover

V-2 SIVAREDDY KAVITHA

by SIVAREDDY

₹225
In stock · 42 available
PublisherJHARI POETRY CIRCLE
LanguageTelugu
మోహనా! ఓ మోహనా! నా కింద పక్కలానో నావ కింద నీళ్ళలానో కళ్ళకింద నీడలానో ఆకాశం కింద పక్షిలానో పక్షిరెక్కల కింద గాలిలానో, ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలానో ఎండాకాలం గాలి మండి పైకి లేచినప్పుడు నువ్వు కనబడతావు వీధిలో 'ఎర్రటి సూర్యుడు రాయి' నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినపడతావు దూరదూర ప్రాంతాల నుంచి తరుముకొచ్చే-తోటల మీదుగానో నదీజలాల మీదుగానో పంటపొలాల మీదుగానో-గాలి ఉప్పెనలా ముంచెత్తుతావు. ఎప్పుడు చూచినా నీ వేళ్ళు రక్తమయాలయే వుంటాయి. ఎప్పుడు చూచినా నీ కళ్ళు సూర్యాస్తమయాలయే వుంటాయి. పొద్దుటిపూట తలుపులు ఓరగా తీసే వుంటాయి రాత్రి వేడిగాలంతా అయిష్టంగానే బయటికి నడుస్తుంది. కోడికూతల్లేని ఉదయసంధ్యలు నీ నగ్నపాదాల్లా వస్తూనే ఉంటాయి. చేతులెత్తి ఎవ్వరికీ నమస్కరించలేక దేహాన్నిచ్చి జీవితాన్ని కొనుక్కున్నావు. కళ్యాణమందిరం పక్కన తెంచుకోలేని నాగపాశాలు కంఠానికి బిగుసుకుంటాయి. మనసుకు పడ్డ ఈ బేడీలు ఎవ్వడూ విప్పలేడు. చేదైన వేపచెట్టు చిగురించిన వసంతకాలంలా నువ్వు-అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురువనంలా నువ్వు మోహనా! ఓ మోహనా! కె. శివారెడ్డి