
V-3 KRISHNAMOHAN KADHA SRAVANTHI
by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
₹70
In stock · 185 available
PublisherDR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
LanguageTelugu
దవులూరి శ్రీకృష్ణ మోహనరావు 1. కోమట్ల కోర్టు కేసు ద్రాక్షారంలో పసుమర్తోరిలాటి పెద్ద కుటుంబాలోళ్ళున్నా, చిల్లర జంగీడి కోమట్లూ ఉన్నారు. ప్రాచీన దేవాలయం ఉన్న ఊరు కనుక, వందలకొలది సంవత్సరాలుగా వారం సంత జరుగుతున్నది కనుక కోమట్లుకు, భోగంలకు ద్రాక్షారంలో సంఖ్యకు లోటులేదు. భోగంలు చదువుకొని, సంస్కారమేర్పరచుకొని మంచి వృత్తులలో స్థిరపడు తుంటే మిగతా కులాలవాళ్ళు, భోగంల స్థానం భర్తీ చేస్తున్నారు. మా పెద్దలు ఆస్తులివ్వక్కరలేదు. జంగిడీయిస్తే చాలు ఏ జంతికలన్నా అమ్మేసుకు బ్రతికేస్తామనే ధైర్యం కోమట్లది. పెద్ద షావుకార్ల కయితే యిబ్బందేలేదు. వ్యాపారం చేస్తూ ఆ డబ్బు మరిక్కెడో చేరుస్తూ, యీ వ్యాపారానికి ఐపి పెట్టేసి, అప్పులొగ్గొట్టి, దాచిన డబ్బుతో మరో వ్యాపారం ఏ కొడుకు పేరు మీదో ప్రారంభించటం, ఎన్నిసార్లు ఐపి పెడితే అంత గొప్పోడన్నమాట. కారుమూరి వీరమ్మగారిదో చిన్న కుటుంబం. భర్త యిద్దరాడపిల్లలు పుట్టిన తర్వాత ధనుర్వాతం వచ్చి చచ్చిపోయాడు. అతను పాత యినుము, చిత్తు కాగితాల వ్యాపారం చేసేవాడు. అతను పోయాక వీరమ్మగారు ఆ కొట్టు కొన్నాళ్ళు నడిపి యిద్దరు కూతుళ్ళకు చెరో ఎకరం కట్నం యిచ్చి పెళ్ళిచేసేసారు. మగదక్షత లేకుండా ఆ వ్యాపారం చేయటం కష్టమని కొట్టుమూసేసి గుడ్వెల్గాను ఆ స్థలానికి 30 వేల రూపాయలు సంపాదించి, వాటితో మూడెకరాలు కొని, కౌలుకిచ్చేసి ఆ కౌలు గింజలతో ఆ కూతురింట్లో కొన్నోళ్ళు, ఈ కూతురింట్లో కొన్నాళ్ళు గడిపేసేది. ఆవిడ నిశాని. చండిండం