
V-3 OKA ASPRUSHYUNI YUDDHA GADHA
₹600
In stock · 5 available
PublisherLOKAYATA PRACHURANALU
LanguageTelugu
ASPRUSHYUNI YUDHA GADHA - 3 Dr. Kathi Padmarao ఒక అస్పృశ్యుని యుద్ధ గాధ పేరుతో డాక్టర్ కత్తి పద్మారావు గారి స్వీయ చరిత్ర ఇప్పటికి రెండు భాగాలు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను చైతన్యవంతుల్ని చేశాయి. మొదటి భాగంలో ఒక వ్యక్తి "" చరిత్రగా కాక భారతదేశంలో అస్పృశ్యతకు గురై యుద్ధ వీరులుగా మారి విజయ పతాకలు ఎగరవేసిన వారి చరిత్రగా ప్రజలను కదిలించింది. రెండవ భాగం దళితుల కారంచేడు పోరాటంలోని సమర శంఖం పూరించింది. ఈ మూడవ భాగంలో డాక్టర్ కత్తి పద్మారావు గారి సాహిత్యాధ్యయనం, కవితా సృష్టి, తాత్విక జీవన గానం, రచనా శిల్ప ప్రస్థానం ఒక ప్రవాహంగా మన ముందు ఆవిష్కరింపబడింది. ముఖ్యంగా దళితులు కేవలం అస్పృశ్యులు కారని, భారతదేశ చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్ర మూలాలు వారి జీవన విధానంలో ఉన్నాయని నిరూపించబడింది. ఈ మూడో భాగానికి ప్రధానాంశం డాక్టర్ కత్తి పద్మారావు గారి జీవితంలోని నిరంతర అధ్యయన క్రమం నుండి ఆయన వెలికి తీసిన సామాజిక జీవన సత్యాలు. ఇవి ఈ గ్రంథంలో మనల్ని కదిలిస్తాయి. ఆయన గొప్ప కవిత్వ శిల్పనిర్మాత. తాత్విక నిధి. త్యాగపూరితమైన జీవన గమనం ఆయనది. ప్రపంచమంతా తిరిగిన సుదీర్ఘ ప్రయాణ వీక్షణం, బౌద్ధ జీవన గమనం, పూలే అంబేద్కర్ సిద్ధాంతాల వెలుగులతో ఆయన భారతీయ తత్వశాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన క్రమం మనకు కనిపిస్తుంది. ఈ గ్రంథం చదువుతుంటే మనకు ఎన్నో విలువైన పుస్తకాలు, వ్యక్తిత్వాలు, కవితా ప్రవాహికలు, పోరాట శక్తులు మనల్ని ప్రజ్వలింపచేస్తాయి. డాక్టర్ కత్తి పద్మారావు గారి స్వీయ చరిత్ర అంటే సమకాలీన భారతదేశ చరిత్రే. ఆంధ్రుల పోరాట గాథే. ఆంధ్ర సాహిత్య, సామాజిక, సాంస్కృతిక చరిత్రే. ఆయన వ్యక్తిగా ఎప్పుడూ జీవించలేదు. సంఘసంస్కృతి, నైతిక శక్తి, నిజాయితీ, ధీరోదాత్తత ఆయన విలువలు. రూసో, మహాత్మాపూలే, పెరియార్ రామస్వామి నాయకర్, అంబేద్కర్, బెర్ట్రాండ్ రస్సెల్, ఇంగర్ సాల్ వలె కత్తి పద్మారావు గారు కూడా ఒక యుగ సంకేతమని ఈ గ్రంథం నిరూపిస్తుంది. ఇక గ్రంథంలోకి వెళ్లి మనము సామాజిక, సాంస్కృతిక, రాజకీయ యోధులమవుదాం. యుద్ధ కౌశలాన్ని నేర్పుకుందాం. విజేతలుగా నిలబడదాం. మహాకవి డా॥ కత్తి పద్మారావు గారి రచనలను ఆదరించి పఠిస్తున్నందుకు పాఠకలోకానికి కృతజ్ఞతలు. ఈ గ్రంథాన్ని కూడా మీ కరదీపికగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. లోకాయత పబ్లికేషన్స్