
V-3 SIVAREDDY KAVITHA
by SIVAREDDY
₹225
In stock · 43 available
PublisherJHARI POETRY CIRCLE
LanguageTelugu
గదిలో కూచున్నవాడి ప్రపంచమే వేరు కళ్ళుంటాయి. పరిమితమయిన దృశ్యాలకే పరిమితం మూసిన కిటికీల్ని, గోడల్ని దాటలేవు-సర్కస్ బోనులోని సింహాల్లా, అసహనంగా అన్నింటినీ మింగేసేటట్టు అక్కడక్కడే తిరుగుతుంటాయి. -నుంచున్న పుస్తకాలూ, పడిపోయిన పుస్తకాలూ పాత పేపర్లూ, కొన్ని జ్ఞాపికలూ, ఖాళీ ఫ్లవర్వేజ్ అర్ధాకలితో వున్న బౌద్ధభిక్షువూ చెడిపోయిన టెలిఫోన్, ఖాళీకుర్చీలు ముప్ఫై ఏళ్ళ కిందటి యౌవనం ఫోటోలు టిష్యూ పేపర్స్, దయామయి వాకర్ అక్కడక్కడ చించి పారబోసిన చీకటిముక్కలు- అన్నీ భయంకర స్వప్నాల్ని గర్భీకరించుకుని నీరెండిపోయిన నేత్రాల్లా, గదిలో కూర్చున్నవాడి ప్రపంచమే వేరు, పరిమితమయిన అపరిమిత దృశ్యాలకే