VAADU - NENU by VIVINA MURTHY Telugu book cover

VAADU - NENU

by VIVINA MURTHY

₹180
In stock · 163 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126474
210 Vaadu... Nenu (Novel) 1963 - టీనేజ్ భారతం- రాజమండ్రి- కలిసారు వాళ్లిద్దరు. ఒకే కుగ్రామంలో ఒకే సమయంలో పుట్టినవారు. వేయ్యేళ్ల పరిణామాలలో విడివిడిగా పెరిగినవారు. వలసపాలనలో బీజం పడిన సార్వత్రిక విద్యావిధానంతో యాదృచ్ఛికంగా కలిసినవారు. నిర్హేతుక అనురాగంతో ఒకటయ్యారు. ఒకరికి ఒకరు అయ్యారు. ఆ బంధం కలకాలం నిలిచిందా? మంచి సమాజం కోసం కలవరించారు. ఒకరితో ఒకరు కలగలసిపోవాలని ప్రయత్నించారు. అలాగే ఉన్నారా? 'ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధం' ముగించి 'ప్రచ్ఛన్న విభజన' మంత్రపఠనం ఆరంభించారు పెత్తందార్లు. గతపు గంతల ఉత్పత్తి చేపట్టారు. మార్పుని మళ్లించటానికి వ్యూహం తలపెట్టారు. వేల సంవత్సరాల పరిణామాలు, రెండు వందల ఏళ్ల పరపాలనా పరిణామాలు అమ్మక వస్తువులు అయ్యాయి. ఇందులో లాభాలు ఏవి? ఎవరివి? అధికార తృప్తి కొందరిది.. సంపద పోగేత కొందరిది. నాయకులవి మీసాలు దువ్వుడు. వ్యాపారులవి ముసిముసి నవ్వులు. వర్తమాన భారతానికి మూలాలు ఆ అమ్మకంలో ఉన్నాయి. ఆ వ్యాపారాన్ని వ్యతిరేకించేవారే దాని ప్రచారకర్తలు. దాన్ని నిరసించేవారే కొనుగోలుదార్లు. 'వ్యక్తిగత రాజకీయాధికారం' ఒక్కటే 'సమూహ రాజకీయాధికారం' అనే రేపర్లో సరుకులు చెల్లిపోతున్నాయి. 60 ఏళ్ల ఈ పరిణామాలలో మనుషులుగా కలవాలనుకున్న ఆ ఇద్దరూ ఏమయ్యారు? బీటలు వారుతున్న బంధంలో ఒకడు ఒకడిని కోరినదేమిటి? శవసంస్కారమా? సిల్లీ కోరికా? దేనికైనా ప్రతీకా? రండి! వాళ్లిద్దరూ చేసిన ప్రయాణంలో పాల్గొందాం! వాళ్లు చేసుకున్న చర్చల్లో పొందిన ఉద్వేగాలలో పాల్గొందాం! పరిణామంలో భాగంగా సాగిన విప్లవాల ఎత్తుపల్లాలను కందాం! పరిణామాన్ని ఆకళింపుచేసుకుందాం! 'వాడూ.. నేనూ' చదువుదాం! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004 ISBN 978-93-48126-47-4