VAAKYA VIHARAM by M V R SASTRI Telugu book cover

VAAKYA VIHARAM

by M V R SASTRI

₹200
In stock · 28 available
PublisherM V R SASTRI
LanguageTelugu
మా మాట మా నాన్నగారిని ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. ఆయన ఇప్పటి దాకా ఎన్నో ఆర్టికల్స్, పుస్తకాలు రాశారు. కాని మేము రాస్తున్న మొదటి ఆర్టికల్ ఇదే. మా మొదటి ఆర్టికల్ మా నాన్నగారి గురించి రాయటం ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మ నడుపుతున్న “దుర్గా పబ్లికేషన్స్" ద్వారా మా నాన్నగారు రాసిన పుస్తకాలు ప్రచురిస్తున్నాము. మా నాన్న గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో మేము "సుపథ"ని మొదలు పెట్టాము. తెలుగు పుస్తక ప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక, ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థపడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న మా నాన్నగారి ఆలోచనకి రూపమే "సుపథ" (www.supatha.in) ఇప్పటిదాకా మేము "దుర్గా పబ్లికేషన్స్" ద్వారా మా నాన్నగారి పుస్తకాలు మాత్రమే ప్రచురిస్తున్నాము. ఇప్పుడు! మా పబ్లికేషన్స్ ద్వారా ఇతర రచయితల పుస్తకాలు కూడా ప్రచురించాలి అని ఈ మధ్య అనుకున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు ప్రసిద్ధ రచయిత, జర్నలిజం రంగంలో దాదాపుగా 40 ఏళ్ళుగా వున్నారు. ఆయన షష్టిపూర్తి సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక ఎందుకు వేయకూడదు అని అనిపించింది. మేము ఇతర రచయితల పుస్త కాలు ప్రచురించాలి అని అనుకున్నాం. కానీ మా మొదటి ప్రచురణ మా నాన్నగారి మీదనే కావటం మాకు ఎంతో సంతో షంగా ఉంది.. మొదట మా నాన్నగారి స్నేహితులు కొందరికి ఈ ఆలోచనని ఆయనకి తెలియకుండా చెప్పాము. వాళ్ళు సంతో షించారు. మా నాన్నగారి గురించి రాస్తామన్నారు. పని ఒక కొలిక్కి వచ్చాక మా నాన్నగారికి ఇలా సంచిక తెద్దామని అను కుంటున్నట్టు చెప్పాము. మొదలు ఒప్పుకోలేదు. తర్వాత మేము మళ్లీ అడిగాక మొత్తానికి సరే అన్నారు. మాకు నడిచే దైవం అయిన మా పూజ్యగురువుగారు సద్గురు శివానంద మూర్తి గారికి ఇలా మా నాన్నగారి షష్టి పూర్తి సందర్భంగా ఒక ప్రత్యేక సంచికని తేవాలని ఉంది అని చెప్పినప్పుడు ఆయన తమ దివ్య ఆశీస్సులు అందిం చారు. ఈ సంచికకి ఒక సందేశాన్ని ఇవ్వమని కోరగా మా గురువుగారు తను అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చి నందుకు ఎంతో కృతజ్ఞులం. ఈ పుస్తకం ఇలా తయారవటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మొదటి నుంచీ మాకు అండగా నిలిచిన ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంకులికి కృతజ్ఞతలు. చాలామంది ప్రముఖ రచయితలకు, సీనియర్ జర్నలిస్టులకి, మా నాన్నగారి స్నేహితులకీ ఈ సంగతి చెప్పగానే మాకు అనుకున్న టైంకి ఆర్టికల్స్ రాసి ఇచ్చారు. ఈ పెద్ద లందరికీ ధన్యవాదాలు. ఈ సంచికలో మా నాన్నగారి మీద రాసిన ఆర్టికల్స్ మాత్రమే కాకుండా మా నాన్నగారు రాసిన ఎన్నో ఆర్టికల్స్ నుంచి మచ్చుకు కొన్ని ప్రచురిస్తున్నాము.