VAANA CHINUKULU by VARANASI NAGALAKSHMI Telugu book cover

VAANA CHINUKULU

by VARANASI NAGALAKSHMI

₹75
In stock · 21 available
PublisherVARANASI NAGALAKSHMI
LanguageTelugu
ప్రకృతి సౌందర్యాస్వాదన నిత్యజీవితంలో భాగంగా పెరిగిన శ్రీమతి వారణాసి నాగలక్ష్మి పుట్టిల్లు నూజివీడు దగ్గర ప్లీడరుగారి తోట. తల్లిదండ్రులు శ్రీమతి పార్వతి, శ్రీ ముష్టి రామకృష్ణ శాస్త్రి. నూజివీడు ధర్మ అప్పారావు కళాశాలలో బియస్సీ వరకు చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎమ్. ఫిల్. చేశారు. హైస్కూలు చదువు నుంచి చదువు పూర్తయ్యే వరకు నేషనల్ స్కాలర్షిప్ పొంది, వరుసగా మూడుసార్లు యూనివర్సిటీ ఫస్ట్ంక్ సాధించిన వీరు చక్కని చిత్రకారిణి కూడా. వీరి కథలూ, కవితలూ ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, రచన, స్వాతి మొదలైన వార, మాస పత్రికలలో ప్రచురితమైనాయి. ఆలిండియా రేడియోలో ప్రసారమైన వీరి కధానిక 'ప్రశ్నార్థకం' అనేక ప్రశంసలు పొందింది. భర్త ఇ.ఎన్.టి. సర్జన్, డాక్టర్ వి.ఎస్. శర్మ, ఇద్దరు పిల్లలు జయంత్, వర్షిణి.