
VAARTHALA VENUKA KATHA
₹200
In stock · 323 available
PublisherK.RAMACHANDRAMURTHY
LanguageTelugu
ముందుమాట చోదక శక్తులు 'We are like masons. We build forts and prisons. We talk about Kings and Cabbages. Nothing is alien to us' యుఎస్ఐ మాజీ బ్యూరో చీఫ్ ధర్మవరపు సీతారామ్. 'వార్తల వెనుక కథ'ను సేకరించే ప్రయత్నంలో కలసినప్పుడు ఆయన అన్నమాటలివి. జర్నలిజం ఒక నషా అంటారా యన. 'డబ్బుకోసం జర్నలిస్టు అయ్యేవాడు ఎప్పుడూ గొప్ప జర్నలిస్టు కాలేడు. అంతకు మించిన ఆనందాన్ని అనుభవించే లక్షణం ఉండేవాడే మంచి జర్నలిస్టుగా రాణిస్తాడు' అని కూడా అంటారాయన. డబ్బును మించిన ఆ ఆనందం ఏమిటి? వార్త అంటే పరి జామం, సమాచారం, విజ్ఞానం. ఒక ఆలోచన. ఒక సందేశం. ఒక ఆనందం. ఒక దుఃఖం. ఒక వింత. ఒక విడ్డూరం. అన్నీ కలగలిసిన ఒక అధికారం. వార్తకు శాసించే లక్షణం ఉంది. అధిక్షేపించే స్వభావమూ ఉంది. తీర్పు చెప్పే గుణమూ ఉంది. అందుకే 'జర్నలి స్టు ఆక్షేపకుడు, అభిశంసకుడు, సలహాదారు, సార్వభౌమాధికార పరిరక్షకుడు, జాతుల బోధకుడు' అంటారు నెపోలియన్ బోనపార్టే. మన కళ్లు ప్రపంచంలో జరిగే సమస్త పరి ణామాలను వీక్షించే తొలి గవాక్షాలు. మన చేతివేళ్లు ప్రపంచానికి సందేశాలు పంపే అక్షర దివిటీలు, డబ్బును మించిన ఆనందం అదే. చాలాకాలం జర్నలిజం వృత్తిలో జీతాలు సరిగ్గా రాకపోయినా వందలాది మంది ఇదే ఆనందంకోసం, ఆత్మతృప్తికోసం ఒకప్పుడు కలాలతో, ఇప్పుడు కంప్యూటర్లతో సహజీవనం చేస్తున్నారు. ఈ ప్రపంచానికి ఏదో చాటి చెప్పాలన్న ఆరాటం వారిని నడిపిస్తూ ఉంటుంది. జర్నలిస్టులు కర్మసా క్షులు. కర్మజీవులు. ప్రపంచంలో జరిగే అన్ని పరిణామాలకూ స్పందిస్తారు. కానీ చలించ రు. కవి, పాత్రికేయుడు అల్లం నారాయణ మాటల్లో చెప్పాలంటే, 'వార్తల కంటిన కన్నీళ్లూ, చీమూనెత్తురు దులిపేసి దుఃఖము ఆవేశకావేశాలకు అతీతంగా ఘనీభవించి పొయ్యేవాళ్లం'.