VACHANA GEETHA by RAMACHANDRAN PIDATHALA Telugu book cover

VACHANA GEETHA

by RAMACHANDRAN PIDATHALA

₹75
In stock · 5 available
PublisherRAMACHANDRAN PIDATHALA
LanguageTelugu
నామాట 'గీత' ఎందుకు చదవాలి? "శ్రీ మద్భగవద్గీత” ఉపనిషత్తుల సారాంశము. మానవుని మానసిక రుగ్మతలకు మహా ఔషధము. ఇది విశ్వజనీనము. దీనిని ఒక మతగ్రంథము అని పిలవాలనుకుంటే, వాస్తవంగా ఇది "మానవ మతగ్రంథము”. మనిషి నిరాశా, నిస్పృహలతో కృంగిపోయి, తన కర్తవ్యాన్ని నిర్వహించలేని పరిస్థితులలో అతనిని ఉత్తేజ పరచి, కర్తవ్యాన్ని బోధించి, విస్సహాయత నుండి బయటపడవేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుణ్ణి అలాగే చేశాడు శ్రీకృష్ణుడు. మానవునిలోని గుణాలను (సాత్త్విక, రాజస, తామస త్రిగుణములు), వాటి లక్షణాలను, వికారాలను, ప్రభావాన్ని వివరించి, వద్దుణాలను పెంపొందించుకొని దుర్గుణాలను అణచుకొను విధానాలను వివరిస్తుంది. నిష్కామకర్మలను ప్రోత్సహిస్తూ, ఫలాపేక్ష రహితంగా కర్మల నాచరించవలెనని, కర్మలు చేయకుండా ఉండరాదని మనిషి యొక్క కర్తృత్వ నిర్వహణ బాధ్యతను గుర్తుచేస్తుంది. గుణాలను బట్టి కర్మలను, శ్రద్ధాభక్తులను వివరిస్తూ సద్గుణము లతో కూడిన కర్మలు సత్ఫలితాల నిస్తాయని విశదీకరిస్తుంది. శ్రద్ధ లేకుండా ఏ పనియు చేయరాదనియు, శ్రద్ధతో ఆచరించిన కర్మలే సత్ఫలితాల నిస్తాయని తెలియ జేస్తుంది. ఫలాపేక్షతో కర్మల నాచరించినట్లయితే, ఊహించిన ఫలితాలు, కర్మాచరణము వల్ల లభింపనపుడు, నిరుత్సాహంతో, నిస్పృహతో ఆ మనిషి మృగంగా మారే ప్రమాదముంటుందని హెచ్చరిస్తుంది. అంతిమంగా తన జన్మకు కారణమైన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలియ జేయడం ప్రతి మనిషి యొక్క కనీస కర్తవ్యమని ప్రబోధిస్తుంది. పైన వివరించిన లక్షణాలన్ని, ఏ ఒక కులమునకు గాని, జాతికి గాని, మతమునకు గాని, కాలమునకు గాని లేక దేశమునకు గాని పరిమితమైనవి కావు. ఈ సృష్టిలో మానవజన్మ తీసికొన్న ప్రతి ఒక్కరికి అన్వయిస్తాయి. అందుకే 'భగవద్గీత’ ఒక కాలానికి కాని, ఒక దేశానికి గాని, ఒక కులానికి గాని, ఒక మతానికి గాని లేక ఒక మనిషికి గాని సంబంధించినది కాదు. 'గీత' సర్వజనులకు, సర్వ విశ్వాసము లకు, సర్వకాలాలకు, సర్వదేశాలకు సంబంధించినది. అందరి శ్రేయస్సును అభిలషించే గ్రంథరాజము. మనిషి యొక్క సమస్య లన్నింటికి సత్వర పరిష్కారం భగవద్గీత చూపుతుంది. కాబట్టే “నాకు ఏవైనా సమస్యలెదురై నిస్పృహతో ఉన్నప్పుడు భగవద్గీత పుటలను తెరచిచూస్తే నా సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటాడు” మహాత్మగాంధి. భగవద్గీతను గూర్చి తెలియనివారు, విననివారు ఉండరు.