VADHUVARULA VIVAHAPU PONTHANA by POPURI MADHAVARAO Telugu book cover

VADHUVARULA VIVAHAPU PONTHANA

by POPURI MADHAVARAO

₹80
In stock · 22 available
PublisherPOPURI MADHAVARAO
LanguageTelugu
వధూవరుల వివాహపు పొంతన (Marriage Matching) భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం వేదోక్తంగాను, పురాణోక్తంగాను జరుగుతుంది. వివాహం ఒక ముఖ్యమైన, పవిత్రమైన శుభకార్యము. జ్యోతిష శాస్త్రానుసారం గురుగ్రహం వివాహకారకుడు మరియు పుత్రకారకుడు. ఈ గురుగ్రహ కరణాకటాక్షములు లేనపుడు వివాహానికి, వైవాహిక సౌఖ్యానికి ఆటంకాలు ఏర్పడతాయి. “వివాహాలు దైవనిర్ణయాలు"గా చెప్పుకుంటాము. దానికి భగవంతుని అనుమతి, దీవెన కావాలి. మనిషికి వివాహం ఒక సాంఘిక సదాచారం. మానవ సంస్కారాలన్నింటిలో వివాహ సంస్కారం ప్రధానమైంది. సంస్కారమంటే మనిషిలోని ప్రజ్ఞను, శక్తిని మేల్కొల్పి సమాజ అభివృద్ధికి నడిపించడమని భావం. వివాహమువల్ల ఋణత్రయముల నుండి పురుషునికి విముక్తి కలుగుతుందంటారు. స్త్రీ పురుషులకు వివాహం అనేది ఒక అభయం, ఒక మర్యాద, ఒక రక్షణ, ఒక గౌరవం. కష్టసుఖాలను కలబోసి అనుభవించి జీవించడమే వివాహధర్మం. భార్యాభర్తల అనుబంధం మాటలకందనిది. మనిషికి పూర్ణత్వం కలిగించే సంస్కారాలలో ప్రధానమైనది వివాహం ఒకటి. స్త్రీ, పురుషుల రూపంలో అవిభక్తమైన సత్యాన్ని అనుభూతి పొందేందుకే వివాహ సంస్కారం ఏర్పడింది. సంస్కారమనగా జీవియొక్క ప్రజ్ఞను నిర్బాధకమైన కర్తవ్యము నెడల ఉన్ముఖము చేసి, దానిని నెరవేర్చుట వలన కలుగు లాభమును పొందునట్టి మార్గము. మానవుడు పుట్టుకచేతనే ఋణపడియున్న మూడు ఋణములలో నొకదాని నుండి విమోచన మొందుటనేది వివాహ సంస్కారము వలన కలుగుతుంది. దేవఋణము, పితృఋణము, ఋషిఋణములని మానవునికి మూడు విధముల ఆజన్మ ఋణములున్నవి. (i) దేవ ఋణము : గాలి, నీరు మున్నగు తన పరిసర దేవతల యెడలను, సకాల వర్షాది ఋత ధర్మదేవతల యెడలను మానవుడు తనకు గల ఋణమును (బాధ్యతను) తీర్చుకొనుట.