
VAIDEHI
by DR.NANDAMURI LAKSHMI PARVATHI
₹50
In stock · 14 available
PublisherDR.NANDAMURI LAKSHMI PARVATHI
LanguageTelugu
ముందుమాట స్త్రీ అంటే సహనం, క్షమ, కుటుంబ బాధ్యతలతో పాటు, ఆ గౌరవాలను తానే మోస్తూ కరిగి పోయే కొవ్వొత్తిలాంటిది. ఇది ఏ యుగంలో అయినా. ఏ దేశంలో అయినా స్త్రీ లందరిది ఒకటే పరిస్థితి. బాధకు తరాల భేదాలు లేవు. రామాయణ కాలంలో వైదేహిని ఒకరకంగా బాధపెడితే, తదనంతర పరిణామ సమాజంలో ద్రౌపదిని మరొరకంగా అవమానించారు. ఈ దేశంలో స్త్రీల స్థానం పాదాల దగ్గర లేదా నెత్తిమీద! ఆ రెండిటి వల్ల తమకు ఒరిగిందేమీలేదు. ఎందుకంటే సమానస్థాయి వున్నప్పుడే కదా ఆ పరాధీనతను పోగొట్టుకొనగలిగేది. ఆమెను పరిశుద్ధంగా వుంచటం అనే పేరుతో అతిహీనంగా చూసారు. కేవలం నీతి సూత్రాలన్ని ఆమె లైంగికత రక్షణ చుట్టూనే తిరిగాయి. అదొక్కటే అనైతికతకు కొలబద్దగా మార్చారు. దానిక తగినట్లుగా, తన రక్తంలో ఆ భావాలు జీర్ణంకావటానికి అటువంటి సాహిత్యాన్నే సృష్టించారు. ఆ విధమైన అణచివేత నాటి నుండి నేటికీ కొనసాగుతూనే వుంది. రూపాలు మారినా మూలాలు ఒక్కటే. అందుకే రామమనోహర్ లోహియా ఒకమాట అంటారు. 'మిథ్యాభిమానం తప్పుడు ఆదర్శాల వలన భారతీయ మేధస్సు స్త్రీలపట్ల సంకుచితమైపోయింది నావరకు నేను స్త్రీ తన అంతరంగిక స్వేచ్ఛను కాపాడుకోవటానికి ఈ వ్యవస్థ మీద పోరాడాలి. ఆమెకు ఆదర్శం- సీత సావిత్రులు కాదు - ద్రౌపది మాత్రమే! అంటే ఆమెలోని పోరాటపటిమ తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి నిలబడటం-మొత్తం పురుష వ్యవస్థనే ప్రశ్నించిన తీరు-పురుషాహంకారాన్ని గెలిచినతీరు-సహనం-వ్యక్తిత్వం- ఈ లక్షణాలు స్త్రీలు పెంపొందించుకోవాలి-పిరికి తనంతో పారిపోకూడదు. నేను 'వైదేహి' లో కూడా ఆవిధమైన తిరుగుబాటును చూపిచటానికి ప్రయత్నించాను. తప్పొప్పులు నిర్ణయించే అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న సమాజ వ్యవస్థ ఒక స్త్రీ జీవితాన్ని నిలువునా పాతేయటానికి ఎలా కంకణం కట్టుకుందో ఈ రచన ద్వారా అర్థం అవుతుంది. ఇక ధర్మమనే పేరుతో ఆమె భర్త నిండు గర్భిణి అని కూడా చూడకుండా అపరాధి అనే భావన కలిగించి పరిత్యజించాడు. ఈ సంఘర్షణ నేపథ్యమే నా 'వైదేహి రచన. వైదేహి కావచ్చు, మరో స్త్రీ కావచ్చు లేదా మరో రూపమైన అవమానం కావచ్చు. కానీ మూలం మాత్రం స్త్రీ బాధలే, ఈ రచనలో మిథ్ పరిహరించి అసలైన సమాజాన్ని - స్త్రీల హృదయ వేదనను చూపించటమే నా లక్ష్యం. స్త్రీల అంతరంగిక క్షోభకు స్థల, కాలనిర్ణయంలేదు. ఎక్కడున్నా ఆ బాధ ఒక్కటే.