VAJMAYA SUDHATARANGAALU by SAMUDRALA SATHAKOPAACHARYA Telugu book cover

VAJMAYA SUDHATARANGAALU

by SAMUDRALA SATHAKOPAACHARYA

₹40
In stock · 3 available
PublisherSAMUDRALA SATHAKOPAACHARYA
LanguageTelugu
పరిచయము సముద్రాల శఠకోపాచార్యులు గారు 19 సంవత్సరాలుగా నా వంటి విద్యార్థినీ, విద్యార్థులకు సంస్కృత పాఠాలను బోధిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఒక ప్రక్క ఇంటర్, డిగ్రీ, పి.జి. విద్యార్థులకు వారివారి స్థాయిని బట్టి పాఠాలను నేర్పుతూనే, మరోప్రక్క సమాజంతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచు కున్నారు. సద్గురువుల నుండి తాను అభ్యసించిన 'సద్గుణ' పాఠాలను వ్యాసాల ద్వారా, రేడియో, టి.వి. ప్రసంగాల ద్వారా సమాజంలోని బాలబాలికలకు బోధిస్తున్నారు. మాకు పాఠాలు (1995 ఇబ్రహీంపట్నం, గురుకుల విద్యాపీఠ్ జూనియర్ కళాశాలలో) చెప్పినప్పటినుండి ఇప్పటి వరకు కూడా మనసును ప్రభావితం చేసే ఎన్నో సుభాషితాలను బోధిస్తూనే ఉన్నారు. ఈ మధ్య గురువుగారు 'వ్యక్తిత్వ వికాసాన్ని' కలిగించే వ్యాసాలను రచిస్తూ, విద్యార్థిలోక శ్రేయస్సుకు పాటుపడుతున్నారు. ఆ వ్యాసాలను 'వాఙ్మయ సుధాతరంగాలు', 'సద్భావలహరి' గా గ్రంథ రూపంలోకి తెచ్చారు. రామాయణమహాభారతాల అధ్యయన ఆవశ్యకతను, భగవద్గీత శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రాల ప్రాముఖ్యమును, ఆర్షవాఙ్మయ ప్రశస్తిని, నేటి తరానికి సంగ్రహంగా తెలియజెప్పే వ్యాసాలను ఆర్షవిజ్ఞాన సౌరభాలు అనుగ్రంథముగా వెలువరించారు. అట్లే 'అష్టోత్తర శత సూక్తి రత్నమాలిక', 'వందే వాల్మీకి కోకిలమ్' అను పుస్తకములను త్వరలో వెలువరించనున్నారు. నేను కామర్స్ విద్యార్థినైనా నాలో సాహిత్యాభిరుచిని కల్గించి సద్గ్రంథ పఠనాభ్యాసాన్ని కలిగించిన మా 'సముద్రాల శఠకోపాచార్యులు' (SANSKRIT SIR) గారిని పరిచయం చేస్తున్నందుకు ఆనందిస్తున్నాను.