
VAJRALA BEHAARI
₹120
In stock · 2 available
PublisherSONTI JAYAPRAKASH
LanguageTelugu
VAJRALA BEHAARI by sonti jayaprakash "మగవాళ్ళంటేనే అసహ్యం పెంచుకున్న స్త్రీ- ఆమెకు రోత పుట్టించిన -ఆ మగవాడిని చంపితే, అదొక నేరంగా పరిగణించకుండా ఉండలేదా ఈ పురుషాధిక్య ప్రపంచం? పగలంతా నాతో దొర్లాడిన తరువాత ఆ పురుషుని ఒంటినుంచి వెలువడే గబ్బువాసన ఆ ఆడదానికి అంటుకుంటే దాన్ని వదిలించుకోవడానికి ఎన్ని సోపులైనా చాలవు. ఎన్ని క్లీనింగ్ బ్రష్షులైనా సరిపోవు." సాయంత్రం 6 గంటలు స్పానిష్ కథ "నాకొక్క మాట చెప్పు? నా గురించి ఏమి విన్నావు?" అడిగాడు. "దైవసాక్షిగా నిజం చెప్పమంటారా?" "దైవసాక్షిగానే, నిజమే చెప్పు?" "నువ్వు అందరికంటే అధమాధముడని?" చెప్పిందా అమ్మాయి. మృత్యుశయ్యపై స్పానిష్ కథ "భౌతిక శాస్త్రం, ఖనిజ శాస్త్రాలలో కొంచెం ప్రావీణ్యం సంపాదించాను. మీ చేతిలో ఉన్న గులకరాయి వంటి వస్తువు ఏమిటో గుర్తించారా?.. శాస్త్రీయ పధ్ధతిలో, ఒక నిర్దుష్ట క్రమాన్నసరించి తయారుచేసిన గోధుమవర్ణ షట్భుజ వజ్రం సార్! అతి ఖరీదైన వజ్రం !" అని చెప్పాడు. వజ్రాల బేహారి ఇంగ్లాండు కథ ఈ సంపుటిలోని కొన్ని కథల్లో "క్రైం ఎలిమెంట్" ప్రధానంగా ఉన్నా, అంతర్లీనంగా - జాలి, కరుణ, ప్రేమ వాటిలో చిప్పిల్లుతుంటాయి. స్వార్థ ప్రయోజనం నిమిత్తం కన్న కూతురునే రాజకీయనాయకుని వద్దకు ఒకరాత్రి పంపించిన ఒక తండ్రి మీద అంతులేని ఏవగింపు కలుగక మానదు. -పబ్లిషర్స్