VALASA by DR.V.R.RASANI Telugu book cover

VALASA

by DR.V.R.RASANI

₹180
In stock · 166 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
VALASA Dr. V.R. RASANI పుట్టినూరు, కన్నతల్లి స్వర్గంతో సమానం అంటారు. పుట్టినూరు అమ్మ వడయితే, పుట్టినప్పటినుంచీ తన సాధక బాధకాలలో పాలుపంచుకున్న ఆ ఊరిజనం దేవతలతో సమానం. అట్లాంటి పుట్టినూరుని వదిలేసినవాడు అమ్మ ఒడికి దూరమైన పసికందు లాంటివాడు. అందుకే పుట్టినూరు వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుంది. ఆ తర్వాత వాడేవూర్లో వున్నావొగటే. ఊరు మారుతూనే వాడి ఉనికే కాదు, వాడి పేరుగీరూ అన్నీ మారిపోతాయి. నిత్యం కరువులతో, కక్షలతో కునారిల్లిపోతున్న రాయలసీమ రైతుకు అలాంటి వలస జీవితం అనివార్యమైపోతోంది. నిత్యదారిద్య్రంతో పరాయి ప్రదేశంలోనూ బతుకు బండి నడవక ఛిద్రమైపోతున్న జీవితాలెన్నో. తన ఊరిలో బతకలేక మరో దూరప్రాంతానికి వెళ్ళి, అక్కడ నానాకష్టాలు అనుభవించి, అక్కడా వుండలేక మరో కొత్త ప్రదేశానికి వలసవెళ్ళి, అక్కడా కష్టాల కాల సర్పాలు కాటేస్తే యింకో ప్రదేశానికి మకాం మార్చేస్తూ చివరికి, తాత్త్వికచింతనలోకి వెళ్ళిపోయిన ఓ బడుగు జీవితగాథ 'వలస'. 'మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఋణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట్టికీ, ఆ నీటికీ, ఆ గాలికీ ఎంతవరకు ఋణం వుంటుందో అంతవరకు ఆ మట్టిమీదే జీవిస్తాడు. చివరికి ఈలోకం ఋణం ఎక్కడ తీరిపోతుందో అక్కడే ఆ మనిషి అదేమట్టిలో కలిసి పోతాడు. వలస జీవుల్ని ఈ తాత్త్వికతే పట్టి బతికిస్తుంటుంది.' ఈ జీవిత సత్యాన్ని తెలిపే ఓ మట్టిమనిషి యథార్థ, వ్యథార్థ జీవిత చిత్రణే. సాంస్కృతిక, తాత్త్విక రచయితగా ప్రసిద్ధుడైన డా॥వి. ఆర్. రాసాని కలంనుంచీ జాలువారిన అరుదైన, విశిష్టమైన నవల ఈ 'వలస'’. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004