
VALI PRASA PRAKARANAMULU
by DR.VEMPANTI NAGESWARA SHARMA
₹100
In stock · 17 available
PublisherDR.VEMPANTI NAGESWARA SHARMA
LanguageTelugu
ముందుమాట ఆంధ్ర భాషలోని ఛందో గ్రంథములలో సులక్షణసారము, అనంతుని ఛందము, అప్పకవీయములు ప్రధానమైనవి. ఈ గ్రంథములలో ప్రాథమిక గ్రంథముగా లింగమగుంట తిమ్మకవి విరచిత సులక్షణసారము పేరుగాంచినది. పిమ్మట అనంతామాత్య విరచిత ఛందోదర్పణమునకును, అప్పకవి రచించిన అప్పకవీయమునకును పాఠకులలో విశేషాదరణము నేటికినిఁ గన్పించుచున్నది. వివిధ తరగతులలో ప్రాచ్యభాషా విద్యార్థులకివి అవశ్యపఠనీయములు. విశేషించి ఛందోదర్పణము, అప్పకవీయములందలి వళి ప్రాస ప్రకరణములు పి.డి.సి; బి.ఏ. (లాంగ్వేజెస్) మరియు పి.జి. విద్యార్థులకు పాఠ్య విషయములుగా నున్నవి. ఆయా విద్యార్థులను, ఇతర జిజ్ఞాసువులను దృష్టియందిడుకొని ఛందోదర్పణము-అప్పకవీయములను తులనాత్మకముగాఁ బరిశీలించుట జరిగినది. బహుకాలముగా ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు పాఠప్రవచనము గావించుచుండుటచే వారికిని, ఛందోగ్రంథములపయి నాసక్తిగల ఆంధ్ర భాషాభిమానులకు నా యీ ప్రయత్నము ప్రయోజనకరము కాఁగలదని యాకాంక్షించుచున్నాను. అనంతామాత్యుని ఛందోదర్పణము- (15వ శతాబ్దము), అప్పకవీయము (17వ శతాబ్దము) కంటె రెండు శతాబ్దములకు పైగా ముందు వెలువడిన గ్రంథము. ఈ లాక్షణికుల మధ్యనున్న కాల వ్యవధి యట్టిది. అయినను యతిప్రాసల సంఖ్యాధిక్యమును గమనించి ముందుగా నప్పకవీయ విషయములనుఁ బేర్కొనుచు ఛందోదర్పణముతోఁ బోల్చి సమీక్షించుట జరిగినది. ఏ యే అంశములలో నప్పకవికి అనంతుని గ్రంథమెట్లు మార్గదర్శక మయినదో నిరూపింపఁబడినది. నా యీ ప్రయత్నములోఁ జక్కని సూచనల నందఁజేసి, ప్రోత్సహించిన ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు, మాన్యమిత్రులు, విద్వత్కవులు నగు ఆచార్య పరిమి రామనరసింహం గారికి (ఆచార్యులు, తెలుఁగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం) నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. తమ విలువైన సమీక్షతో అభినందనము నందించి యాశీర్వదించిన