VALLAMPATI KATHALU by VALLAMPATI PRACHURANALU Telugu book cover

VALLAMPATI KATHALU

by VALLAMPATI PRACHURANALU

₹125
In stock · 73 available
PublisherVALLAMPATI PRACHURANALU
LanguageTelugu
రానున్న శిశిరం భక్తిరంజని వినాలని రేడియో పెట్టాను. 1977వ సంవత్సరం... గర్ గర్..... ఆగస్టు నెల..... పదిహేనవ తేదీ...... ఉదయం..... నిలయంలో సమయం సరిగ్గా ఆరు గంటలు. ఈ రోజు స్వాతంత్ర్య దినం - సుకన్య పుట్టినరోజు స్వాతంత్య్రం వచ్చి ముప్పై సంవత్సరాలు..... సుకన్య పుట్టి పాతిక సంవత్సరాలు...... అబ్బో ఎంతకాలం..... ఎంతదూరం! జైల్లోవున్న రోజుల్లో ఒక్కొక్క క్షణం శవజాగరణం చేసిన రాత్రిలా గడిచేది. ఇప్పుడు? సంవత్సరాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి...... సుజలాం సుఫలాం మలయజ శీతలాం! వందేమాతరం.... భారతమాత సుజల, సుఫల! వీధి కుళాయివద్ద అమ్మలక్కల పోరాటం అప్పుడే రాజకీయాల స్థాయిని అందుకుంది. మా వీధికది మలయమారుత రాగం. "సుజలాం....." “ລ້ລ້ ...." సీత వైపు చూచాను. ఓర్పు రూపెత్తిన సీత! అమాయకత్వం, నిష్కాపట్యం తేమగల మనసు ముప్పేటగా అల్లుకున్న నా బ్రతుకు జడ సీత! .... తీసుకున్నాను. సీత చేసిన కాఫీ సీత మనస్సులా వుంది.... వీధంట ఒక గుంపు బిచ్చగాళ్ళు వెళ్తున్నారు. రాత్రి వూరిబయట నాగరికులకు దూరంగా, నాగుపాములకు దగ్గరగా బ్రతికి, ఉదయాన్నే క్షేమంగా వూళ్ళోకొస్తున్నారు. చింపిరి తలలు, పుసికారుతున్న కళ్ళు, ఎముకల గూళ్ళలా వున్నారు భావి భారత పౌరులు.... "సుఫలాం."