VALMIKI RAMAYANAMU - 1 TO 3 PARTS by NAVARATNA BOOK HOUSE Telugu book cover

VALMIKI RAMAYANAMU - 1 TO 3 PARTS

by NAVARATNA BOOK HOUSE

₹1,500
Currently out of stock
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
పరిచయము శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. భారతీయ సంస్కృతికి రామాయణము, భారతము ప్రధానమైన కావ్యములు, పురాణాలు, ఇతిహాసాలు. తపస్వియైన వాల్మీకి తన గురువైన నారద మహర్షిసన్నిధిలో ఒకమారు ఇలా ప్రశ్నించాడు: "ఈ లోకమున ఒక మహానుభావుడైన పురాణ పురుషుడు నాయకుడుగా ఒక కావ్యము వ్రాయదలచుకున్నాను. ఆ నాయకుడు ప్రస్తుతము జీవించియున్నవాడు కావాలి. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు నందు దృఢమైన వ్రతము కలవాడై ఉండాలి" అని మొదలు పెట్టి ఎన్నో సద్గుణాలను ప్రశ్నించాడు. ఈ సద్గుణాలన్నీ శాశ్వత కాలానికి సంబంధించినవి. అంటే మానవుడు ఎప్పటి కాలపువాడైనా సరే అభ్యసించడానికి ప్రయత్నం చేయవలసినవి. అంతావిన్న నారద మహర్షి ఇలా అన్నాడు. “చాలా దుర్లభములైన గుణాలను కీర్తించావు. అయినా అలాంటివాడు ఈ లోకములో, ప్రస్తుత కాలమున ఉన్నాడు. అతడు నీ పరిప్రశ్నం ద్వారా నీ వాక్కుల నుండి ఇప్పటికే రూపాన్ని పొందాడు. అంటే నీకు కావలసిన నాయకుణ్ణి నీలోని వేద ధర్మ సంస్కారాన్ని అనుసరించి నీవే అవతరింప చేసుకున్నావు. ఇక వానిని గూర్చే నీవు కావ్యము వ్రాయవచ్చు. అయినా అలాంటివాణ్ణి గురించి నన్ను కూడాఅడిగినావు గనుక విను. ఇక్ష్వాకు వంశంలో పుట్టి 'రాముడు' అనే పేరుతో జనులచేత కీర్తింపబడుతూ ఒకడున్నాడు. అతడు నీ కావ్యసృష్టికి నాయకుడు.” ఈ విధంగా రాముని గూర్చి నారదుడు వాల్మీకికి ఉపదేశం చేసి సంగ్రహంగా రాముని కథ చెప్పాడు. ఈ భాగాన్నే 'బాల రామాయణం' అంటారు. ఇది పెద్దలందరికీ కూడ ధ్యానం చేయదగిన రామాయణం. దీనిని వాల్మీకి తన రామాయణంలో మొదటి సర్గగా వ్రాశాడు. రామాయణంలో ప్రతి వ్యక్తి ఏ పలుకులు ఎంతగా సంభాషించెనో, ఎంతగా నవ్వెనో, అది మొత్తము వాల్మీకికి దర్శనమిచ్చి కావ్యములో రూపం ధరించింది. వేదమునందు తెలుసుకొనదగిన వాడైన పురుషుడు సర్వజీవులలో అంతర్యామి. అతడే పరమ పురుషుడు. అతనినే పురుషసూక్తం మొదలగు మహా మంత్రాలు స్తోత్రం చేస్తున్నాయి. అతని తత్త్వము సవిస్తరంగా రామచరితంలో ప్రతిబింబించింది. అనగా అతని తత్త్వము సకల ధర్మస్వరూపము. అభివృద్ధి, శ్రేయస్సు కోరిన ఒక్కొక్క వ్యక్తికి, వ్యక్తుల సమూహానికి, సంఘానికి, సమాజానికి, జాతులకు, మానవ జాతికి అవశ్యము. ఆచరణీయమైన ధర్మము. అది తారుమారైనపుడల్లా మరల స్థాపించడానికే ఆ పరమపురుషుడు అనేక అవతారమూర్తుల రూపంలో దిగి వస్తుంటాడు. అలాంటి అవతారమే శ్రీ రామచంద్రమూర్తి. అతడు ధర్మము విగ్రహ స్వరూపముగా అయినవాడు. అతనిని గూర్చి రచింపబడిన రామాయణ కావ్యం కాంతా సమ్మితమైన వేద గ్రంథమై ధర్మ సంస్థాపకంగా వాల్మీకి వాక్కుల ద్వారమున వెలువడింది. నాటికి నేటికి ధర్మస్వరూప నిరూపణకు శ్రీమద్రామాయణము కరగత ముకురము.