VALMIKI RAMAYANAMU NIRVACHANA KAVYAM by SANGEM CHANDRAMOULI Telugu book cover

VALMIKI RAMAYANAMU NIRVACHANA KAVYAM

by SANGEM CHANDRAMOULI

₹250
In stock · 4 available
PublisherSANGEM CHANDRAMOULI
LanguageTelugu
ముందుమాట శ్రీమద్రామాయణము, మహాభారతము, మహాభాగవతములు అతి ప్రాచీన గ్రంథములు. ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయము, నాగరికత, సామాజిక వ్యవస్థలకు దర్పణములు. ధర్మ మార్గాచరణమునకు, సత్య నియతికి, దిశా నిర్ధేశములు. పై మూడు ప్రాచీన కావ్యములలో రామాయణమే ఆది కావ్యము. మానవులకు ధర్మమార్గాచరణను నిర్దేశించు, లౌక్యమును నెరిగించు మహోన్నత గ్రంథము. అందుచే దానిని అనుదినము పఠించుట ఎంతేని అవసరము. రామాయణమనగా రాముని యొక్క నడవడిక, అతని ధర్మమార్గాచరణము. అతని సత్య నియతి యని భావము. రాముడు ఆదర్శప్రాయుడైన తనయుడు, అందుచే పితృవాక్య పరిపాలనార్ధమై సకల భోగముల నిలయమైన రాజ్యాధికారమునే పరిత్యజించి నారచీరలు ధరించి, సీతతోగూడి వనవాసమేగిన ఆదర్శప్రాయుడైన తనయుడు. అంతేగాదు తన సోదరుల నమితముగా ప్రేమించి వారి మనసునెరిగి ప్రవర్తించిన ఆదర్శప్రాయుడైన అన్న. బల పరాక్రమ శక్తి సంపన్నుడు, శౌర్యధనుడు, విలువిద్యలో జగమునకెల్ల మేటి. అతడు సంధించి విడిచిన బాణము గురి తప్పుటయన్నది జరగదు. అందుచే రామ బాణము సాటిలేనిది. రాముడు ఆదర్శప్రాయుడైన భర్త. ఏకపత్నీవ్రతుడు. సీత హృదయములో తానుండి, తన హృదయములో సీత నెప్పుడు నిలుపుకొన్నవాడు. సకల జనులను, తన బిడ్డలవలె కంటికి రెప్పగా కాపాడిన రాజు. దుష్ట శిక్షకుడు, శిక్షజన రక్షకుడు. ఆర్తత్రాణ పరాయణుడు. సామాన్య ప్రజల ఆలోచనను కూడా పరిగణనలోనికి తీసుకొనేవాడు. అందుచే జన బాహుళ్యములో నొకడు తనపై వేసిన నిందను బాపుకొనుటకై తన ధర్మపత్నినే కానలకంపిన కఠోర నియమనిష్టాగరిష్టుడు. అతని పాలనా కాలమొక స్వర్ణయుగము.