
VAMAPAKSHA COMMUNISAM OKA BALARISHTAM
₹30
In stock · 16 available
PublisherN.V.S.NAGABHUSHANAM
LanguageTelugu
ముందుమాట లెనిన్ రాసిన ఈ "వామపక్ష కమ్యూనిజం- ఒక బాలారిష్టం" అనే తన మరో ప్రసిద్ధ గ్రంథాన్ని, మూడో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ (కొమిస్టర్న్) సంస్థ రెండో మహాసభ (ఇది 1920 జూలై 19న పెట్రోగ్రాడ్లో ప్రారంభమై, ఆగష్టు 7న మాస్కోలో ముగిసింది)లో పాల్గొన్న ప్రతినిధులకు అందించడానికి వీలుగా, ఇందులో అధిక భాగాన్ని 1920 ఏప్రిల్లో రాశాడు. రష్యన్ భాషలో మాస్కోలో ఇది 1920 జూన్లో ముద్రించబడి, ఆపై జూలైలో ఫ్రెంచి, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి ముద్రించబడింది. ఈ గ్రంధంలో చెయ్యబడ్డ ప్రతిపాదనలూ, నిర్ధారణలూ మహాసభ ఆమోదించిన తీర్మానాలకు ప్రాతిపదికకావడం గమనార్హం! ప్రస్తుత గ్రంథ రచనకు పూనుకున్న ఆ కాలంలో, విప్లవం విజయం సాధించిన ఆ తొలి సంవత్సరాల్లో లెనిన్ రెండు రకాల ఒత్తిళ్లతో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశ ఆర్థిక స్థితి గతుల్ని, ప్రజల జీవన పరిస్థితుల్నీ తిరిగిగాడిన పెట్టి మరింత మెరుగుపర్చడం! రెండోది! శిశుప్రాయంలో ఉన్న విప్లవ ప్రభుత్వం పీకనొక్కేందుకు వైట్ గార్డులూ, సామ్రాజ్యవాద దేశాల సేనలూ సాగిస్తున్న యుద్ధాన్ని ఎదుర్కొని, ప్రభుత్వాన్ని పటిష్టం చేయడం!! వీటికితోడు, తన మరో గురుతర కర్తవ్యం - మార్భిజం బోధకునిగా జనాలకు కమ్యూనిజం పాఠాలు బోధించి, వారిని క్యాకర్తలుగా తీర్చిదిద్దడం, అందులో భాగంగా మార్చిజానికి వక్ర భాష్యాలు చెప్పే అవకాశవాదులను ఎదుర్కొంటూ, రష్యన్ కార్మిక వర్గం యొక్కా బోల్షివిక్ పార్టీ యొక్క సంపన్న విప్లవానుభవాన్ని ఉపయోగిస్తూ తాను రూపొందించిన విప్లవ సిద్ధాంతాన్ని అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమానికి తోడ్పడం, బాల కమ్యూనిస్టుల తప్పుల్ని సరిదిద్ది, ఆయా దేశాల్లోని విప్లవోద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సూచనలూ సలహాలూ ఇవ్వడం-అనే కర్తవ్యానికి కూడా తగిన ప్రాధాన్యతనిచ్చి తన సమయాన్ని కేటాయించాడు. వీటి వివరాలు కూడా క్లుప్తంగా తెలుసుకుని, ఆపై ప్రస్తుత గ్రంథంలోకి వెళదాం. సామ్రాజ్యవాద ప్రపంచ యుద్ధం రేపిన గాయాలు ఆయా దేశాల్లో కార్మిక వర్గ చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో రెండు దేశాల్లో (హంగరీ, బవేరియా) సోవియట్ అధికారం (అది స్వల్పకాలంలోనే అంతం అయినప్పటికీ) నెలకొనడమేగాక, పలుదేశాల్లో కమ్యూనిస్టుపార్టీలు బహిరంగంగా పనిచేసే అవకాశాన్ని చిక్కించుకున్నాయి. అంతేగాక, రష్యాలో సోవియట్ అధికారపు విజయాల ప్రభావంతో పలు పురోగామి దేశాల కార్మికులు అంతకంతకూ ఎక్కువమంది సోషల్ డెమోక్రసీ యొక్క మితవాద, అవకాశవాద స్థావరాలను వదిలి, కమ్యూనిజం యొక్క స్థావరానికి మళ్లసాగారు.