
VAMAPAKSHAM NUTHANA PRAPANCHAM
₹50
In stock · 293 available
PublisherMARTHA HARNEKAR
LanguageTelugu
మార్తా హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయశాస్త్రవేత్త, పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన 'ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్టారికల్ మెటీరియలిజం' అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సిస్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్త ృతంగా చదవటం మెదలయింది. ఆ పుస్తకాన్ని 63సార్లు పునర్ముద్రించటం జరిగింది. మార్క్సిస్టు సిద్ధాంత రంగంలో అన్ని ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాలు చాలా తక్కువ. పారిస్లో లూయిస్ ఆల్దూస్సర్తోపాటు చదువుకున్న తర్వాత మార్తా హర్నెకర్ తన స్వస్థలమైన చిలీకి తిరిగి వచ్చింది. కాని సాల్వడార్ అలెండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత ఆమె క్యూబాలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వచ్చింది. క్యూబాలో ఆమె మెమోరియా పాప్యులర్ లాటినో అమెరికానా (వీజూూూ) అనే పరిశోధనా సంస్థను నడుపుతూ రాయటం కొనసాగించింది. ఇప్పటివరకు ఆమె 60 పుస్తకాలను ప్రచురించింది. నూతన రాజకీయ ఉద్యమాలు, సజీవ రాజకీయాలతో వాటి సంబంధాల పట్ల మార్తా కి ఉ న్న ఆసక్తి ఆమె రాసిన 'ది లెఫ్ట్ ఆఫ్టర్ సియాటిల్,' ఇంకా ఇటీవల ప్రచురితమైన 'ది లెఫ్ట్ ఆన్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ద ట్వంటియత్ సెంచురి' అనే పుస్తకాలలో ప్రతిఫలించింది. బొలివేరియన్ విప్లవాన్ని (సైమన్ బొలివర్ అనే వెనిజులా తత్వవేత్త ఆలోచనలతో, ఉత్తేజంతో ముందుకు వచ్చిన విప్లవ సిధ్ధాంతం) బలంగా సమర్థించే మార్తా హర్నేకర్, 'అండర్స్టాండింగ్ ది వెనీజులన్ రివల్యూషన్: హ్యూగో ఛావెజ్ టాక్స్ టు మార్తా హెర్నేకర్; వెనీజులా: మిలిటేర్స్ జంటో అల్పా ఉనా రివల్యూసియాన్ సుయ్ జనరిస్ అనే పుస్తకాలను కూడా ప్ర