
VAMSI MA PASALAPUDI KATHALA KAMAMEESHU
₹300
In stock · 5 available
PublisherDR.K.RAMACHANDRA REDDY
LanguageTelugu
ISBN9789334180794
ఒక మాట... చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర వంటి బాలల పత్రికలలో కథలు, అద్భుత, జానపద ధారావాహికలు చిన్నతనంలో చదివాను. 1990ల దశకం నుండి ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి, విపుల, చతుర, ఆహ్వానం వంటి వార, మాస పత్రికలలో కవిత్వం, కథలు, నవలలు చదవడం మొదలుపెట్టాను. ఈ దశలో మా వూరిలో సమాంతర సాహిత్య పఠనం అలవాటున్న అమీనుద్దీన్, జి. శ్రీను, ప్రకాష్ వంటి రచయిత మిత్రులు తోడవడం వల్ల నాలో పఠనాశక్తి పెరిగింది. కాకినాడ విశాలాంధ్ర బుక్ హౌస్లో పుస్తకాలు కొనడం, చదివిన వాటిపై మిత్రులతో చర్చలు విరివిగా ఆ కాలంలో సాగేవి. అలా మిత్రుడు, కవి అమీనుద్దీన్ ప్రోత్సాహంతో హైకూలు చదవడం, ఆ తర్వాత 1998లో సాహిత్య ప్రముఖులు ఇస్మాయిల్, అద్దేపల్లి రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్ ముందుమాటలతో 'రంగుల నింగి' అనే హైకూ సంపుటం కూడా వెలువరించాను. తెలుగు హైకూలపై వున్న అవగాహన, ఆసక్తుల వల్ల ఆ తరువాత 'తెలుగు హైకులలో సామాజికత-ఒక పరిశీలన' అనే అంశంపై ఆచార్య ఎండ్లూరి పధాకర్ గారి పర్యవేక్షణలో 2007లో ఎంఫిల్ కూడా పొందాను. 'తూర్పు గోదావరి జిల్లా కథలు-అలలు' (2012) అనే కథా సంకలనానికీ, 'తూర్పు గోదావరి జిల్లా సాహిత్య చరిత్ర' (2019) అనే గ్రంథానికీ సంపాదకవర్గ పర్కునిగా పనిచేసేటపుడు వంశీ కథల విశిష్టతను వాటిలో కూడా పేర్కొనడం జరిగింది.