
VANAMAMALAI SHATHAPADYA PARIJATHAALU
by DR.TIRUMALA SRINIVASACHARYA
₹80
In stock · 18 available
PublisherDR.TIRUMALA SRINIVASACHARYA
LanguageTelugu
నివేదన పుష్పించిన వృక్షం నుండి పరిమళాలు ఏ విధంగా దశ దిశలు వ్యాప్తి చెందుతాయో, అదే విధంగా పుణ్య పురుషుల కీర్తి ప్రతిష్ఠలు దశ దిశల వ్యాప్తి చెందుతాయి. వికసిత పారిజాత పుష్ప పరిమళాన్ని పవనుడు మోసుకొనిపోయి దశదిశల వెదజల్లునట్లు డా|| వానమామలై వరదాచార్యుల వారు విరచించిన అనేకానేక పరిమళ పద్యములనుండి ఎంపిక చేసిన "శతపద్య పారిజాతాల" పరిమళ వాహకులై డా॥ తిరుమల శ్రీనివాసాచార్యులవారు ఆంధ్రప్రదేశ్ పాఠకుల సుమనస్సుల ఘ్రాణేంద్రియాలకు హాయి నొనగూర్చుటకై పరిమళ వ్యాఖ్యతో కూడిన "శత పద్య పారిజాతాలు" అను పుస్తకమును రచించుట, అభినవపోతన శతజయంతి ఉత్సవ సమితి ద్వారా ప్రచురించుటకు శ్రీనివాసాచార్యులుగారు అనుమతించటం ఆనందదాయకము. ఇట్టి పరిమళ పారిజాత సుమములను మాలగా కూర్చి డా॥ కె.వి. రమణాచార్యులవారికి అంకితము చేయుట ఈ శతజయంతి ఉత్సవముల సుసంపన్నతకు ఒక మంగళ నీరాజనము. ఈ ఆచార్యత్రయము; పద్య ప్రణేత, వ్యాఖ్యాత మరియు కృతి స్వీకర్త మూడు తరాలకు ప్రతినిధులై సాహిత్య వరివస్యలో తరించి, తరింపచేసిన పుణ్యమూర్తులు. వీరి సంగమము సహృదయ త్రివేణీ సంగమము. కృతి స్వీకర్త డా|| కె.వి.రమణాచార్యులవారు 'అభినవ పోతన శతజయంతి ఉత్సవ సమితి'కి గౌరవాధ్యక్షులు. వారి నిరంతర సలహా, సహకారాలతో ఈ శతజయంతి ఉత్సవాలు సుసంపన్నం అయినాయని సవినయముగ విన్నవించు కుంటున్నాను, గర్విస్తున్నాను. ఒక తెలంగాణా మహాకవి శతజయంతి ఉత్సవాలు విజయవంతంగా జరగడం దైవానుగ్రహం, బుధజన సంక్పలం, భావి తరాలకు మార్గదర్శకం. తెలుఁగు సాహిత్య సౌరభాన్ని ఆఘ్రాణించుటయేగాని అధ్యయనం చేయని నేను ఈ శతజయంతి ఉత్సవాలకు కార్యదర్శిత్వం నెరపగలగడం ఒక మహదవకాశము. శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల దివ్యానుగ్రహం.