
VANDALADI VANTINTI CHITKALU - 20
₹20
In stock · 4 available
PublisherM.S.R PUBLICATIONS
LanguageTelugu
వందలాది వంటింటి చిట్కాలు ఇంటి విషయంలోనూ, వంట విషయంలోనూ ఇల్లాళ్ళకు చిటికెలో అయిపోయే పని పద్ధతి తెలియకపోవటం వల్ల ఎంతో టైమ్ తీసుకుంటుంది. డబ్బుకూడా ఎక్కువగా ఖర్చవుతుంది. అలాంటి బాధలు పడకుండా చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిపని, వంటపని సులభంగా ఉంటుంది. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతమంచిది మనం వాడుకోగా మిగిలిన కూరగాయలు గాని, వంట దినుసులు గాని, పాడైపోకుండా జాగ్రత్త తీసుకోవడం లాంటి విషయాలు ప్రతి ఇల్లాలు తెలుసుకుని వుంటే మంచిది. నేలమీద, బట్టలమీద మరకలు పడితే వాటిని ఎలా తొలగించాలి. చిరాకు పుట్టించే బొద్దింకల వంటి వాటిని పారదోలడం ఎలా? వంట విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!.