VANDELLA OU by DAVID Telugu book cover

VANDELLA OU

by DAVID

₹180
In stock · 2 available
PublisherTELANGANA ATHMAGOURAVA VEDIKA
LanguageTelugu
సంపాదకుని మాట ఉస్మానియూ యూనివర్సిటీ పోరాటాల పురిటి గడ్డ. సామాజిక స్పృహతో ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడిన నేల. వివక్షతలకు వ్యతిరేకంగా విద్యార్థులు రక్తం చిందించిన రుధిర భూమి. ప్రజాసమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాడిన ఉద్యమకారులకు నెలవు. దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. ఎంతోమంది విద్యా వేత్తలు, సాహితీ వేత్తలు, నాయకులు ప్రపంచానికి అందించిన ఉద్యమాల పోరాటాల గడ్డ ఇప్పుడీ యూనివర్సిటీ వందేళ్ల మైలురాయిని చేరుకుంది. చరిత్ర కాలగర్భంలో వందేళ్ల సమయం చాలా చిన్నదే. కానీ ఆ వందేళ్ల కాలం అనేక ఉద్యమాలకు సాక్ష్యంగా నిలుస్తూ, తన నుండి తానే స్ఫూర్తి పొందుతూ, నిత్య నూతనత్వంతో విరాజిల్లుతే మాత్రం అది అద్భుతమే. అలాంటి చరిత్రే మన ఉస్మానియా యూనివర్సిటీది. ఈ యూనివర్సిటీలోని ఏ కాలేజీ మెట్లనడిగిన ఉజ్వల గతాన్ని కథలు కథలుగా వినిపిస్తుంది. నాటి వందేమాతర ఉద్యమం మొదలు నేటి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకూ, మొన్నటి నాజీ ఫాసి వ్యతిరేక ఉద్యమాలు మొదలూ నేటి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల వరకూ, నిన్నటి మండల్ కమండల్ మొదలూ ఇప్పటి మతోన్మాద వ్యతిరేక ఉద్యమాల వరకూ ఎన్నో అద్భుతమైన ఘట్టాలకు సజీవ సాక్షం ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం. యూనివర్సిటీ అంటే కేవలం చదువునే విద్యార్థులకు దాన్ని బోధించే అధ్యాపకులకు సంబంధించిన అంశంగానే చూస్తున్న సమయంలో, దానీ అడ్డుగోడల్ని చెరిపేసి చదువంటే కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితమైంది కాదని చదవాల్సింది ఆకలిగొన్న అభాగ్యుల కథలూ, వెతలని నాలుగు గోడల మధ్య ఉన్న చదువును 'గ్రామాలకు తరలించిన' చరిత్ర ఇక్కడి విద్యార్థులది. ప్రజలనుంచి ప్రజల వద్దకు అన్న వర్గపోరాటాల చరిత్రను అకడమిక్ తరగతుల్లోకి తీసుకొచ్చి మేథో మథనం చేసిన ఘనచరిత్ర ఇక్కడి విద్యార్థులది.